తదుపరి సీబీఐ చీఫ్ ఎంపిక 24న !

న్యూఢిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) తదుపరి చీఫ్‌ను ఈ నెల 24 న నియమించనున్నారు. ఇందుకోసం కేంద్రం ఇప్పటికే కసరత్తులు ప్రారంభించింది. ఈ మేరకు ఈ నెల 24న పీఎం నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి కమిటీ సమావేశం కానుంది. సీజేఐ ఎన్.వీ. రమణ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత అధీర్ రంజన్ చౌదరీతో పాటు పలువురు ఈ సమావేశంలో పాల్గొనున్నారు. ఈ సమావేశంలోనే సీబీఐ తదుపరి చీఫ్‌ను ఎంపిక చేయనున్నట్టు తెలుస్తోంది. కాగా సీబీఐ చీఫ్ […]

Update: 2021-05-13 11:48 GMT

న్యూఢిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) తదుపరి చీఫ్‌ను ఈ నెల 24 న నియమించనున్నారు. ఇందుకోసం కేంద్రం ఇప్పటికే కసరత్తులు ప్రారంభించింది. ఈ మేరకు ఈ నెల 24న పీఎం నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి కమిటీ సమావేశం కానుంది. సీజేఐ ఎన్.వీ. రమణ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత అధీర్ రంజన్ చౌదరీతో పాటు పలువురు ఈ సమావేశంలో పాల్గొనున్నారు.

ఈ సమావేశంలోనే సీబీఐ తదుపరి చీఫ్‌ను ఎంపిక చేయనున్నట్టు తెలుస్తోంది. కాగా సీబీఐ చీఫ్ పదవి కోసం 1984,1985,1986 బ్యాచ్‌లకు చెందిన అధికారుల జాబితాను పరిశీలించనున్నారు. ఇప్పటి వరకు ఉన్న సమాచారం మేరకు రాకేశ్ ఆస్థానా, వైసీ మోదీ, సుబోధ్ జైశ్వాల్ సీబీఐ చీఫ్ రేసులో ముందు వరుసలో ఉన్నట్టు తెలుస్తోంది.

Tags:    

Similar News