కొవిడ్‌తో మారిన సెలబ్రేషన్స్ ట్రెండ్
సిటీడెస్క్: ఏడాదికి ఇదే చివరి రోజు. మరో సంవత్సరం కాలం చక్రంలో కలిసిపోనుంది. 2020 ఎన్నో జ్ఞాపకాలు.. మరెన్నో అనుభవాలను మదిలో పదిలం చేసింది. ప్రతీ ఇయర్‌కు ఒక ప్రత్యేకత ఉంటుంది. అలానే 2020కి చరిత్రలో అంతకు మించిన గుర్తింపు ఉండనుంది. పల్లె నుంచి పట్నం వరకు.. పేద నుంచి ధనవంతుల వరకు జీవితాంతం గుర్తుండిపోనుంది. కనిపించని శత్రువుతో ప్రపంచమంతా పోరాడింది. ఎన్నో పాఠాలు నేర్పింది. మనిషి విలువను చెప్పింది. సాయం చేసే చేతులను పరిచయం చేసింది. […]
సిటీడెస్క్: ఏడాదికి ఇదే చివరి రోజు. మరో సంవత్సరం కాలం చక్రంలో కలిసిపోనుంది. 2020 ఎన్నో జ్ఞాపకాలు.. మరెన్నో అనుభవాలను మదిలో పదిలం చేసింది. ప్రతీ ఇయర్‌కు ఒక ప్రత్యేకత ఉంటుంది. అలానే 2020కి చరిత్రలో అంతకు మించిన గుర్తింపు ఉండనుంది. పల్లె నుంచి పట్నం వరకు.. పేద నుంచి ధనవంతుల వరకు జీవితాంతం గుర్తుండిపోనుంది. కనిపించని శత్రువుతో ప్రపంచమంతా పోరాడింది. ఎన్నో పాఠాలు నేర్పింది. మనిషి విలువను చెప్పింది. సాయం చేసే చేతులను పరిచయం చేసింది. కుటుంబ విలువను నేర్పింది. సంప్రదాయ పద్ధతులు బెటర్అని నిరూపించింది. పాశ్చాత్య సంస్కృతి తప్పు అని చెప్పింది. మొత్తంగా శృతి మించిన ఆధునిక పొకడలతో పెనుముప్పు అని ఒక హెచ్చరిక జారీ చేసింది 2020.
నయాసాల్.. ఇంట్లోనే బెటర్
మరో 24 గంటల్లో నూతన ఏడాది రానుంది. కొత్త ఆశలు, సరికొత్త ఆశయాలతో నవ వసంతంలోకి అడుగుపెట్టేందుకు అందరూ సిద్ధమవుతున్నారు. ఈ వేడుకను సంతోషంగా జరుపుకోవడానికి ప్లాన్లు సిద్ధం చేసుకుంటున్నారు. ఎన్నో జ్ఞాపకాలను మిగిల్చిన 2020 గుడ్‌బై చెప్పి.. ఉరిమే ఉత్సాహంతో 2021కి స్వాగతం పలుకేందుకు వేచి చూస్తున్నారు. అయితే కరోనా వెంటాడుతున్న నేపథ్యంలో మహానగరంలో జోష్ కాస్త తగ్గింది. ప్రతి ఒక్కరినీ వైరస్ వణికిస్తుంది. ఈ క్రమంలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పై చీకట్లు కమ్ముకుంటున్నాయి. పోలీసులు సైతం పార్టీలకు అనుమతి ఇవ్వడం లేదు. ప్రభుత్వం, వైద్యులు సామూహిక పార్టీలు వద్దంటూ హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో ఇంట్లోనే ఉండి న్యూ ఇయర్ వేడుకను కుటుంబ సభ్యుల మధ్య సంబురంగా జరుపుకుందాం. స్టే హోం.. స్టే సేఫ్.. సూత్రాన్ని పాటించి ఇంట్లోనే ఆనందంగా గడిపి కొత్త ఆశలకు ఊపిరిపోద్దాం. ఇలా చేస్తే తీయని వేడుకగా డిసెంబర్31, జనవరి 1 మిగిలిపోనుంది.
కేక్ కటింగ్‌తో..
డిసెంబర్31 వచ్చిందంటే కేకులకు భలే గిరాకీ ఉంటుంది. కేక్ కట్‌చేసి కేరింతలు కొట్టడం ఈ రోజు ప్రత్యేకత. అలాగే బేకరీలు సైతం ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. అయితే బయటికి వెళ్లి పార్టీలకు డబ్బులు కుమ్మరించే బదులు.. ఒక కేక్ తీసుకెళ్లి కుటుంబ సభ్యులతో కలిసి కట్‌చేసి హ్యాపీగా 2020కి గుడ్‌బై చెప్పడమే కాదు.. న్యూయర్కు గ్రాండ్ వెల్కమ్ చెప్పవచ్చు. కేక్ కోసం బేకరీకి సైతం వెళ్లాల్సిన పని లేదు. అందరూ కలిసి తలో చేయి వేసి ఇంట్లో రెడీ చేసుకోవడానికి యూ ట్యూబ్ సైతం ఉండనే ఉంది కదా.
వెరైటీ వంటకాలతో..
పార్టీలు, ఈవెంట్స్ అంటూ హోటళ్లలో వేలకు వేల రూపాయలు కుమ్మరించే బదులు.. ఇంట్లోనే వెరైటీ వంటకాలతో ఘుమఘుమల మధ్య అదరిపోయే పార్టీ చేసుకోవచ్చు. వీటికి అయ్యే ఖర్చు సైతం పార్టీలకు పెట్టిన దాంట్లో సగం కూడా కాదు. నచ్చిన వంటకాలు ఇష్టంగా తయారు చేసుకొని టెర్రస్ లేదా.. హాల్లో అందరూ కలిసి కూర్చొని సరదా ముచ్చట్ల మధ్య విందు భోజనంలా చేస్తే ఆనందం ఎంత ఖర్చు పెట్టిన దొరకనే దొరకదు.
మ్యూజికల్ నైట్..
డిసెంబర్31 ఫస్ట్. ఆనందాల డే. ఇయర్ ఎండ్ పార్టీల ఉంటే ఆ హంగామే వేరు. అదీ విశ్వనగరంలో అయితే మరింత ఎక్కువగా ఉంటుంది. పబ్బులు, మ్యూజికల్ షో, పార్టీలు, ఈ వెంట్స్ అంటూ ఎన్నెన్నో కార్యక్రమాలతో సందడి సందడిగా ఉంటుంది. అయితే వీటన్నంటికీ గుడ్ బై చెప్పి.. పిల్లలతో సరదాగా గడిపే ఏర్పాట్లు చేసుకోవచ్చు. ఇంట్లోనే మ్యూజికల్ నైట్ జోష్‌ను పొందవచ్చు. ఇప్పుడు అందరికీ సెల్ఫోన్లు, స్మార్ట్ టీవీలు కామన్ అయ్యాయి. అందులో డీజే సాంగ్స్పెట్టుకొని.. నృత్యాలు చేస్తూ.. జాలీగా గడుపొచ్చు.
టీవీ షోలు.. ఫన్నీ గేమ్స్
ప్రత్యేక రోజుల్లో బులితెర నిండా స్పెషల్ షోలే. జాలీగా నవ్వుకునే కార్యక్రమాలు, పిల్లల డ్యాన్సులు, ఇంటర్వ్యూలు ఇలా అనేక ప్రోగ్రామ్స్ వస్తుంటాయి. అంతేకాదు.. సరికొత్త సినిమాలను సైతం వేస్తుంటారు. ఎంచక్కా.. కుటుంబమంతా ఒకచోట చేరి నచ్చిన షోలు చూస్తూ గడిపేయొచ్చు. అంతేకాదు.. పిల్లలతో కలిసి సరదా ఆటలు ఆడుతూ మళ్లీమళ్లీ రాని రోజుగా నిలుపుకోవచ్చు.
హౌస్ డెకరేషన్
ఇంటిని అందంగా డెకరేషన్ చేసుకొని నయా సాల్ కు ఫ్రెష్‌గా స్వాగతం పలుకొచ్చు. ఇంటిని లైట్స్ తో ముస్తాబు చేసి ఆ వెలుగులో కుటుంబ సభ్యులతో కలిసి పార్టీ చేసుకుంటే.. ఏ మ్యూజికల్ నైట్సరితూగదు.
ఆన్లైన్లో ఎన్నెన్నో..
ఆన్లైన్లోనే అన్ని లభిస్తున్నాయి. కాలు బయటపెట్టకుండా పార్టీకి కావాల్సినవన్నీ సమకూర్చుకోవచ్చు. వైరెటీ స్వీట్స్.., ఫుడ్, ఫ్రూట్స్ అన్ని ఆర్డర్స్ చేసుకొని.. ఇంట్లోనే జాలీగా గడుపొచ్చు. వీటికి స్పెషల్ ఆఫర్స్సైతం ఇవ్వనున్నారు.