ఇసుక మాఫియాలో కొత్త వ్యూహం
దిశ, ఖమ్మం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలంలో ఇసుక మాఫియా నిర్వహకులు రెచ్చిపోతున్నారు. ఏకంగా అధికారులకే తెలియకుండా.. అనుమతులు ఇచ్చినట్లుగా నకిలీ సంతకాలతో జిరాక్స్‌లను సృష్టించి ట్రాక్టర్ల కొద్ది ఇసుకను అక్రమంగా గమ్యస్థానాలకు చేర్చుతూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే బుధవారం లక్ష్మీదేవిపల్లి ఎంపీడీవో రామారావు ఇసుక తరలింపునకు అనుమతి ఇచ్చినట్లుగా ఒక నకిలీ జిరాక్స్‌ను సృష్టించారు. పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా ఈ పత్రాలను చూపించగా.. అనుమానం వచ్చిన పోలీసులు మండల పరిషత్ అధికారులతో మాట్లాడి […]
దిశ, ఖమ్మం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలంలో ఇసుక మాఫియా నిర్వహకులు రెచ్చిపోతున్నారు. ఏకంగా అధికారులకే తెలియకుండా.. అనుమతులు ఇచ్చినట్లుగా నకిలీ సంతకాలతో జిరాక్స్‌లను సృష్టించి ట్రాక్టర్ల కొద్ది ఇసుకను అక్రమంగా గమ్యస్థానాలకు చేర్చుతూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే బుధవారం లక్ష్మీదేవిపల్లి ఎంపీడీవో రామారావు ఇసుక తరలింపునకు అనుమతి ఇచ్చినట్లుగా ఒక నకిలీ జిరాక్స్‌ను సృష్టించారు. పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా ఈ పత్రాలను చూపించగా.. అనుమానం వచ్చిన పోలీసులు మండల పరిషత్ అధికారులతో మాట్లాడి ఎంక్వేరి చేయగా నకిలీ పత్రమని తేలింది. దీంతో ట్రాక్టర్‌ను, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు స్టేషన్‌కు తరలించారు.