రూ.200 కోట్ల భూమి కేసులో.. కొత్త కోణం
దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని రూ.200 కోట్ల భూమి కేసులో మంగళవారం కొత్త కోణం వెలుగుచూసింది. 1.20 ఎకరాలకు సంబంధించిన భూమి పత్రాలన్నీ నకిలీవని ఏసీబీ అధికారులు విచారణలో వెల్లడించారు. కోర్టుకు సమర్పించిన ప్రతాలన్నీ ఫోర్జరీ, నకిలీవని అధికారులు నిర్ధారించారు. ఈ కేసుకు సంబంధించి పాతబస్తీకి చెందిన సయ్యద్ ఖలీద్‌పై చర్యలు తీసుకోవాలని ఏసీబీ అధికారులు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్‌కు లేఖ రాసారు. ఇదే స్థల విషయంలో అనుకూలంగా వ్యవహరించేందుకు అధికారులు లంచాలు […]
దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని రూ.200 కోట్ల భూమి కేసులో మంగళవారం కొత్త కోణం వెలుగుచూసింది. 1.20 ఎకరాలకు సంబంధించిన భూమి పత్రాలన్నీ నకిలీవని ఏసీబీ అధికారులు విచారణలో వెల్లడించారు. కోర్టుకు సమర్పించిన ప్రతాలన్నీ ఫోర్జరీ, నకిలీవని అధికారులు నిర్ధారించారు. ఈ కేసుకు సంబంధించి పాతబస్తీకి చెందిన సయ్యద్ ఖలీద్‌పై చర్యలు తీసుకోవాలని ఏసీబీ అధికారులు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్‌కు లేఖ రాసారు. ఇదే స్థల విషయంలో అనుకూలంగా వ్యవహరించేందుకు అధికారులు లంచాలు తీసుకున్నట్టు తెలిపారు. కాగా రూ.50 లక్షలు లంచం తీసుకుంటూ ఆర్‌ఐ నారార్జున రెడ్డి సైతం అధికారులకు చిక్కాడు. ఈ కేసులో అనుకూలంగా వ్యవహరించిన స్థానిక తహసీల్దార్ సుజాతను కూడా ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. కేసు ఆలస్యం చేసేందుకు రూ.2 లక్షలు డిమాండ్ చేసూ, ఎస్‌ఐ రవీంద్రనాయక్‌ను కూడా మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో డాక్యూమెంట్లే బోగస్ అని తేలడంతో అధికారులు మరింత లోతుగా విచారించే పనిలో పడ్డారు.