ఫంక్షన్‌లో అన్నం మిగిలిందా.. అయితే ఈ పని చేయండి..!

దిశ, కరీంనగసర్ సిటీ: అన్నం పరబ్రహ్మ స్వరూపం అనేది అనాదిగా వస్తున్న నానుడి. దీనిని ఇప్పటికీ ఆచరించే వాళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో కోకొల్లలు కాగా, పట్టణాల్లో మాత్రం పట్టించుకోవడం అరుదు. ఫంక్షన్లలో అయితే గిన్నెల కొద్దీ మిగిలిన ఆహారం కూడా చెత్తకుండిలోకి వెళ్తుంది. అయితే ఇకముందు అలా చేయకుండా, వీబీ ఫౌండేషన్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఫంక్షన్లలో అన్నం మిగిలితే మాకు ఒక ఫోన్ కాల్ చేస్తే చాలు మేము ఆ ఆహారాన్ని సేకరించుకెళ్తామంటూ చెబుతోంది. […]

Update: 2021-11-18 08:42 GMT

దిశ, కరీంనగసర్ సిటీ: అన్నం పరబ్రహ్మ స్వరూపం అనేది అనాదిగా వస్తున్న నానుడి. దీనిని ఇప్పటికీ ఆచరించే వాళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో కోకొల్లలు కాగా, పట్టణాల్లో మాత్రం పట్టించుకోవడం అరుదు. ఫంక్షన్లలో అయితే గిన్నెల కొద్దీ మిగిలిన ఆహారం కూడా చెత్తకుండిలోకి వెళ్తుంది. అయితే ఇకముందు అలా చేయకుండా, వీబీ ఫౌండేషన్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఫంక్షన్లలో అన్నం మిగిలితే మాకు ఒక ఫోన్ కాల్ చేస్తే చాలు మేము ఆ ఆహారాన్ని సేకరించుకెళ్తామంటూ చెబుతోంది. బుక్కెడు బువ్వ మిగిలినా, వృధా చేయకుండా తమకందిస్తే ఆకలితో ఉన్నవారి కడుపునింపుతామంటుంది వీబీ ఫౌండేషన్.

నగరంలోని వీరబ్రహ్మేంద్ర వృద్ధాశ్రమం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నడుస్తుండగా, వృద్ధులకు ఆహారం కోసం వినూత్న కార్యక్రమం ప్రారంభించారు. నగరంతో పాటు, పరిసర ప్రాంతాల్లో ఎక్కడ, ఎలాంటి ఫంక్షన్లు జరిగిన మిగిలిన ఆహార పదార్థాలు సేకరించి ఆకలితో అలమటించే వారికి అందించాలని నిర్ణయించారు. ఇందుకోసం దాత శంకరయ్య ముందుకొచ్చి ఒక వాహనాన్ని వృద్ధాశ్రమానికి అందజేయగా, గురువారం మేయర్ సునీల్ రావు వీరబ్రహ్మేంద్ర వృద్ధాశ్రమంలో ప్రారంభించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన జమాల్ మహమ్మద్, దాత శంకరయ్య, వృద్ధాశ్రమం వ్యవస్థాపకుడు వీర మాధవ్‌ను అభినందించారు. నగర ప్రజలు నిర్వహించుకునే ఫంక్షన్లలో మిగిలిన ఆహారం వృధా చేయకుండా, ఆశ్రమానికి అందించాలని కోరారు. అందుకోసం 9949914242 నెంబర్‌కు సమాచారం అందించాలని సూచించారు.

Tags:    

Similar News