భైంసాకు కొత్త ఏఎస్పీ.. ఇకపై నిరంతర నిఘా..?
దిశ, వెబ్‌డెస్క్ : నిర్మల్ జిల్లా భైంసాలో చెలరేగిన అల్లర్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అలర్లపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడితో పాటు పలు హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తుండటంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ఇప్పటికే భైంసా అల్లర్లకు సంబంధించి ఐజీపీ నార్త్ నాగిరెడ్డి డీజీపీ కార్యాలయానికి నివేదిక పంపించారు. పలువురు అనుమానితులను అదుపులోనికి తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే భైంసా ఏఎస్పీగా కిరణ్‌ను నియమిస్తున్నట్లు డీజీపీ మహేందర్ రెడ్డి […]
దిశ, వెబ్‌డెస్క్ : నిర్మల్ జిల్లా భైంసాలో చెలరేగిన అల్లర్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అలర్లపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడితో పాటు పలు హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తుండటంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ఇప్పటికే భైంసా అల్లర్లకు సంబంధించి ఐజీపీ నార్త్ నాగిరెడ్డి డీజీపీ కార్యాలయానికి నివేదిక పంపించారు.
పలువురు అనుమానితులను అదుపులోనికి తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే భైంసా ఏఎస్పీగా కిరణ్‌ను నియమిస్తున్నట్లు డీజీపీ మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు. మరోసారి భైంసాలో ఘర్షణలు జరగకుండా ఉండేందుకు పోలీసు క్యాంపులను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.