సాగునీటి ప్రాజెక్టులకు భరోసా..

ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన రాష్ట్ర మూడో బడ్జెట్పై ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మిశ్రమ స్పందన కనిపించింది.

Update: 2025-03-20 04:01 GMT
సాగునీటి ప్రాజెక్టులకు భరోసా..
  • whatsapp icon

దిశ ప్రతినిధి, నిర్మల్ : ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన రాష్ట్ర మూడో బడ్జెట్పై ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మిశ్రమ స్పందన కనిపించింది. పెండింగ్లో ఉన్న అనేక ప్రాజెక్టులు, అభివృద్ధి పనులు సహా ఆదివాసీలు, గిరిజనుల సంక్షేమం ముందుకు సాగుతుందన్న ఆశాభావం జిల్లా వాసుల్లో వ్యక్తమవుతున్నది. బడ్జెట్ వ్యవసాయం, సాగునీటిపారుదల విద్య, వైద్యం, అటవీ గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి వంటి రంగాలకు ఊతం ఇస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సారి బడ్జెట్లో 17 వేల కోట్లకు పైగా నిధులు కేటాయించడంతో ఉమ్మడి ఆదిలాబాద్ గిరిజనం లో హర్షం వ్యక్తమవుతున్నది.

సాగునీటి ప్రాజెక్టులకు మోక్షం..

బడ్జెట్ భారీ మొత్తంలో ప్రవేశపెట్టిన నేపథ్యంలో సాగునీటి రంగానికి పెద్దపీట వేసిన నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులకు మోక్షం కలుగుతుందన్న జిల్లా వాసుల్లో ఉంది. ప్రాజెక్టులకు కేటాయించిన భూములకు సంబంధించిన పునరావాసంతో పాటు పెండింగ్ లో పడిన పలు సాగునీటి ప్రాజెక్టులు వాటి కాలువలో లైనింగ్ పనులు ఈ బడ్జెట్ లో పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే సాగుతున్న ప్రాజెక్టులకు సంబంధించి నిధులు కేటాయింపు పెరగడంతో సకాలంలో పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి.

గిరిజన అభివృద్ధికి పెద్దపీట..

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంటేనే గిరిజనుల జిల్లాగా పేరుంది. గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఈసారి బడ్జెట్లో 17వేల కోట్లకు పైగా నిధులు కేటాయించడంతో ఉమ్మడి ఆదిలాబాద్ గిరిజనంలో హర్షం వ్యక్తం అవుతున్నది. ఉట్నూరు కేంద్రంగా కొనసాగుతున్న ఐటీడీఏకు పూర్వవైభవం వస్తుందన్న ఆశ జిల్లా వాసుల్లో ఉంది. ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానం సైతం ఎస్టీ రిజర్వుడ్ అయిన నేపథ్యంలో కేంద్ర సహాయంతో భారీగా నిధులు వచ్చే అవకాశం ఉంది. అనేక పథకాల్లో కేంద్ర, రాష్ట్రాల సంయుక్త ఆర్థిక నిధుల సమీకరణ జరిగే నేపథ్యంలో ఈ బడ్జెట్ ఉమ్మడి ఆదిలాబాద్ గిరిజనులకు భారీగా లాభదాయకం అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

కొత్త మెడికల్ కాలేజీలకు ఊతం..

ఆరోగ్య రంగానికి సైతం భారీగా ఈ బడ్జెట్ లో నిధులు కేటాయించిన నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు భారీగా లాభం చేకూరుతుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొత్తగా మంజూరు అయ్యి ప్రారంభం అయిన నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల మెడికల్ కాలేజీలకు భారీగా నిధులు వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు.


Similar News