ఊళ్లోకి చుక్కల దుప్పి.. కాపాడిన కాలనీవాసులు..
నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని కొమురం భీం చౌరస్తా డబుల్ బెడ్ రూమ్ కాలనీలోకి అటవీ ప్రాంతం నుంచి చుక్కల దుప్పి రావడంతో అక్కడ ఉన్న పిల్లలు, పెద్దలు స్వయంగా చూసి ఆనందపడ్డారు.

దిశ, ఖానాపూర్ : నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని కొమురం భీం చౌరస్తా డబుల్ బెడ్ రూమ్ కాలనీలోకి అటవీ ప్రాంతం నుంచి చుక్కల దుప్పి రావడంతో అక్కడ ఉన్న పిల్లలు, పెద్దలు స్వయంగా చూసి ఆనందపడ్డారు. ఊళ్లోకి వచ్చిన చుక్కల దుప్పిని చూసి అక్కడ ఉన్న వీధి కుక్కలు తరుముకుంటు రావడంతో అక్కడ ఉన్న కాలనీవాసులు కుక్కల బారి నుండి చుక్కల దుప్పిని కాపాడి ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందచేశారు. ఘటనా స్థలానికి ఫారెస్ట్ అధికారులు చేరుకొని చుక్కల దుప్పిని ఫారెస్ట్ వాహనంలో చికిత్స కొరకు తీసుకవెళ్లారు. దుప్పిని కాపాడినందుకి కాలనీవాసులకు అటవీశాఖ అధికారులు ధన్యవాదాలు తెలిపారు.