నెట్‌ఫ్లిక్స్ యూజర్లకు గుడ్‌న్యూస్.. ఇక గేమ్స్ కూడా అవలేబుల్!
దిశ, ఫీచర్స్: వీడియో స్ట్రీమింగ్ కంపెనీ నెట్‌ఫ్లిక్స్ మంగళవారం తమ ప్లాట్‌ఫామ్‌లో సరికొత్త గేమ్‌లను ప్రవేశపెట్టింది. మూవీస్, సిరీస్‌లకు మించిన ఎంటర్‌టైన్మెంట్ అందించేందుకు సిద్ధమైంది. ఆండ్రాయిడ్ యూజర్స్‌కు మాత్రమే ఈ ఫెసిలిటీ అందుబాటులో ఉండగా.. దీనికి ఎలాంటి అదనపు ఫీజు అవసరం లేదని కంపెనీ తెలిపింది. కానీ నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ మాత్రం కంపల్సరీ అని వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రైబర్స్ స్ట్రేంజర్ థింగ్స్: 1984 (BonusXP), స్ట్రేంజర్ థింగ్స్ 3: ది గేమ్ (BonusXP), షూటింగ్ […]
దిశ, ఫీచర్స్: వీడియో స్ట్రీమింగ్ కంపెనీ నెట్‌ఫ్లిక్స్ మంగళవారం తమ ప్లాట్‌ఫామ్‌లో సరికొత్త గేమ్‌లను ప్రవేశపెట్టింది. మూవీస్, సిరీస్‌లకు మించిన ఎంటర్‌టైన్మెంట్ అందించేందుకు సిద్ధమైంది. ఆండ్రాయిడ్ యూజర్స్‌కు మాత్రమే ఈ ఫెసిలిటీ అందుబాటులో ఉండగా.. దీనికి ఎలాంటి అదనపు ఫీజు అవసరం లేదని కంపెనీ తెలిపింది. కానీ నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ మాత్రం కంపల్సరీ అని వెల్లడించింది.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రైబర్స్ స్ట్రేంజర్ థింగ్స్: 1984 (BonusXP), స్ట్రేంజర్ థింగ్స్ 3: ది గేమ్ (BonusXP), షూటింగ్ హోప్స్ (ఫ్రాస్టీ పాప్), కార్డ్ బ్లాస్ట్ ( అముజో & రోగ్ గేమ్‌లు), టీటర్ అప్ (ఫ్రాస్టీ పాప్) వంటి ఐదు మొబైల్ గేమ్‌లను ఆడగలరు. ఈ గేమ్స్‌ను గూగుల్ ప్లే ద్వారా డౌన్‌లోడ్ చేసుకునే అవకాశముండగా, వీటిని నేరుగా నెట్‌ఫ్లిక్స్ యాప్ ద్వారా యాక్సెస్ చేసుకోవచ్చు. బెంగాలీ, హిందీ, పంజాబీ, మరాఠీ, తమిళంతో సహా భారతీయ భాషల్లో కూడా ఆటలను పొందవచ్చు. అయితే ఏదైనా నిర్దిష్ట భాషను ఎంచుకోకపోతే డిఫాల్ట్‌గా ఇంగ్లీషులో వస్తాయి. కొన్ని నెట్‌ఫ్లిక్స్ గేమ్‌లను ఆఫ్‌లైన్‌లో కూడా ఆడవచ్చు. ప్రస్తుతం ఈ గేమ్స్ ఆండ్రాయిడ్‌కే పరిమితమైనప్పటికీ, iOS వినియోగదారులకు కూడా త్వరలోనే అందుబాటులోకి వస్తుందని కంపెనీ ట్విట్టర్‌లో తెలిపింది.
Disney+ హాట్ స్టార్, HBO Max వంటి స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ నుంచి గట్టి పోటీ తర్వాత నెట్‌ఫ్లిక్స్ కొత్త కస్టమర్లను ఆకర్షించలేకపోయింది. దీంతో గేమింగ్ వరల్డ్‌లోకి అడుగుపెట్టబోతున్నట్లు జూలైలో ప్రకటించగా, కాలిఫోర్నియాకు చెందిన వీడియో గేమ్ డెవలపర్ కంపెనీ ‘నైట్ స్కూల్ స్టూడియో’ని సెప్టెంబరులో కొనుగోలు చేసింది. అంతేకాదు NetFlix కొంతకాలంగా BonusXPతో సహా ఇండీ గేమ్ స్టూడియోలతో పని చేస్తోంది. ప్రస్తుత సబ్‌స్క్రైబర్‌లకు ఉచితంగా గేమ్‌లను అందించడం వల్ల నెట్‌ఫ్లిక్స్ DVDల వ్యాపారం నుంచి మెయిన్ స్ట్రీమింగ్ సినిమాలకు మారేటప్పుడు ఉపయోగించే వ్యూహాన్ని ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. ఇక గేమింగ్ అనుభవం మొబైల్ పరికరాలకు పరిమితం చేస్తుందా లేదా కాలక్రమేణా టీవీలకు కూడా యాక్సెస్ చేస్తుందా? అనే విషయంలో ప్రస్తుతానికి స్పష్టత లేదు.