ఐఐటీలో సత్తా చాటిన నేరేడుచర్ల విద్యార్థి

దిశ, నేరేడుచర్ల: ఐఐటీ అడ్వాన్స్డ్ ఫలితాల్లో సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల పట్టణానికి చెందిన దొంతిరెడ్డి హన్వితారెడ్డి సత్తా చాటింది. ఆలిండియాలో 99.9 మార్కులు పొంది 116వ ర్యాంకు సాధించింది. నేరేడుచర్ల పట్టణంలోని శ్రీవాణి ఇంగ్లీషు మీడియం పాఠశాలలో హన్వితా ప్రాథమిక విద్యను అభ్యసించింది. హైదరాబాద్‌లోని నారాయణ జూనియర్ కళాశాలలో ఇంటర్ పూర్తి చేసింది. గతంలో నిర్వహించిన జేఈఈ బాలికల విభాగంలో జాతీయ స్థాయిలో 3వ ర్యాంకు, ఎంసెట్ ఓపెన్ క్యాటగిరిలో 88వ ర్యాంకు సాధించింది. ప్రస్తుతం ఐఐటీలో […]

Update: 2021-09-15 10:11 GMT

దిశ, నేరేడుచర్ల: ఐఐటీ అడ్వాన్స్డ్ ఫలితాల్లో సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల పట్టణానికి చెందిన దొంతిరెడ్డి హన్వితారెడ్డి సత్తా చాటింది. ఆలిండియాలో 99.9 మార్కులు పొంది 116వ ర్యాంకు సాధించింది. నేరేడుచర్ల పట్టణంలోని శ్రీవాణి ఇంగ్లీషు మీడియం పాఠశాలలో హన్వితా ప్రాథమిక విద్యను అభ్యసించింది. హైదరాబాద్‌లోని నారాయణ జూనియర్ కళాశాలలో ఇంటర్ పూర్తి చేసింది. గతంలో నిర్వహించిన జేఈఈ బాలికల విభాగంలో జాతీయ స్థాయిలో 3వ ర్యాంకు, ఎంసెట్ ఓపెన్ క్యాటగిరిలో 88వ ర్యాంకు సాధించింది. ప్రస్తుతం ఐఐటీలో 116వ ర్యాంకు సాధించడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, శ్రీవాణి పాఠశాల డైరెక్టర్ కొణతం సీతారాంరెడ్డి, నేరేడుచర్ల మాజీ సర్పంచ్ కొణతం సత్యనారాయణ రెడ్డి, నారాయణ సంస్థల ప్రతినిధులు అభినందనలు తెలిపారు.

Tags:    

Similar News