డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు గ్రహణం.. నిర్లక్ష్యానికి నిదర్శనమైన చెట్లు
దిశ, వీణవంక: పేదల సొంతింటి కలను నిజం చేసేందుకు చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణానికి గ్రహణం పట్టింది. అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ల తీరుతో ఇప్పటికే ఇండ్ల నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయి. దీంతో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పేదలకు అందని ద్రాక్ష అన్నట్టు ఉంది. మండలంలోని పోతిరెడ్డిపల్లిలో చేపట్టిన ఇండ్ల నిర్మాణం సగంలోనే ఆగిపోయింది. ఇండ్ల నిర్మాణం చేపట్టి ఇప్పటికే 5 సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా పూర్తి కాలేదు. సగం నిర్మించి ఉన్న ఇండ్లలో చెట్లు […]
దిశ, వీణవంక: పేదల సొంతింటి కలను నిజం చేసేందుకు చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణానికి గ్రహణం పట్టింది. అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ల తీరుతో ఇప్పటికే ఇండ్ల నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయి. దీంతో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పేదలకు అందని ద్రాక్ష అన్నట్టు ఉంది. మండలంలోని పోతిరెడ్డిపల్లిలో చేపట్టిన ఇండ్ల నిర్మాణం సగంలోనే ఆగిపోయింది. ఇండ్ల నిర్మాణం చేపట్టి ఇప్పటికే 5 సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా పూర్తి కాలేదు. సగం నిర్మించి ఉన్న ఇండ్లలో చెట్లు పెరిగాయాంటే నిర్లక్ష్యానికి ఇదే నిదర్శనమని మండల కాంగ్రెస్ నాయకుడు మందల అనిల్ రెడ్డి ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు చొరవ తీసుకుని నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేసి పేదలకు కేటాయించాలని డిమాండ్ చేశారు.