హో.. నన్ను ఓడించింది మీరే కదా!.. నవ్వుతూ పలకరించిన మాజీ సీఎం

తనను ఓడించిన వ్యక్తినే నవ్వుతూ పలకరించిన మాజీ సీఎం నవీన్ పట్నాయక్ ఉదార హృదయంపై నెట్టింట ప్రశంసల వర్షం కురుస్తుంది.

Update: 2024-06-19 07:54 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తనను ఓడించిన వ్యక్తినే నవ్వుతూ పలకరించిన మాజీ సీఎం నవీన్ పట్నాయక్ ఉదార హృదయంపై నెట్టింట ప్రశంసల వర్షం కురుస్తుంది. మొన్న జరిగిన ఒడిషా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలవడంతో ఐదు దఫాల నుంచి సీఎంగా ఉన్న బీజేడీ అధినేత నవీన్ పట్నాయక్ అధికారం కోల్పోయారు. సీఎం ఉన్న ఆయన స్వయంగా హింజలి, కంటాబంజి అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేశారు. రెండు చోట్ల పోటీ చేసిన ఆయనకు .. కంటాబంజి నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్ధి లక్ష్మణ్ బాగ్ చేతిలో ఓటమి పాలయ్యారు. హింజలి నుంచి గెలిచిన ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసేందుకు అసెంబ్లీకి వచ్చారు. ఈ క్రమంలో అందరినీ పలకరిస్తూ వెళుతుండగా.. తనను ఓడించిన బీజేపీ ఎమ్మెల్యే లక్ష్మణ్ బాగ్ లేచి నమస్కరించారు.

వెంటనే నవీన్ పట్నాయక్ స్పందిస్తూ.. హో మీరే కదా నన్ను ఓడించింది అంటూ శుభాకాంక్షలు తెలియజేశారు. దీనికి సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దశాబ్దాల నుంచి ఒడిశా మాజీ సీఎం గా ఉన్న నవీన్ పట్నాయక్ కు కొంచెం కూడా గర్వం లేకుండా తనను ఓడించిన వారిని సైతం నవ్వుతూ పలకరించడం పట్ల ఆయనపై ప్రశంసలు వెళ్లువెత్తుతున్నాయి. వివాదరహితుడుగా పేరున్న ఆయన ఉదార హృదయాన్ని నెటిజన్లు కొనియాడుతున్నారు. తనని ఓడించే వారిపై కక్ష్య గట్టి పగ తీర్చుకోవడానికి వేచి చూసే ఈ రోజుల్లో.. ఎలాంటి ద్వేశం లేకుండా నవ్వుతూ పలకరిస్తున్నారని, నవీన్ పట్నాయక్ లాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండటం ప్రజలకి అవసరం అని పలు రకాల కామెంట్లు పెడుతున్నారు. 


Similar News