అందుకే భారత్-ఫ్రాన్స్‌ సంయుక్త ప్రకటనలో ఆ డీల్ చేర్చలేదు..

ఇటీవల రెండు రోజుల ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో భేటీ అయ్యారు.

Update: 2023-07-18 16:20 GMT

న్యూఢిల్లీ : ఇటీవల రెండు రోజుల ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో భేటీ అయ్యారు. మీటింగ్ ముగిసిన అనంతరం విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో 26 రాఫెల్ మెరైన్ యుద్ధ విమానాల కొనుగోలు ప్రస్తావన లేదు. ఆ తర్వాత ఆలస్యంగా దీనిపై రాఫెల్ జెట్స్ తయారు చేసే డసాల్ట్ ఏవియేషన్ ప్రకటన విడుదల చేసింది. ఇంత భారీ డీల్‌పై ప్రకటన చేసే విషయంలో ఎందుకింత జాప్యం జరిగిందనే దానిపై అంతటా చర్చ జరిగింది. "రాఫెల్ జెట్స్‌కు సంబంధించిన డీల్ అనేది రాబోయే 25 ఏళ్ల రోడ్‌మ్యాప్‌లో భాగం.

అందుకే లేటెస్ట్‌గా కుదిరిన ఒప్పందాలలో దాన్ని చేర్చలేదు. వచ్చే 25 సంవత్సరాల ప్రణాళికలో భాగంగా విడతల వారీగా 26 రాఫెల్ మెరైన్ జెట్స్‌ను ఫ్రాన్స్ నుంచి భారత్ పొందుతుంది. దీనికి సంబంధించిన చర్చలు జరిగి.. కాంట్రాక్ట్ ఖరారు కాకముందే ఆ వివరాలను బయటికి వెల్లడించలేరు. అందుకే ఆ సమాచారాన్ని సంయుక్త ప్రకటనలో చేర్చలేదు" అని సంబంధిత వర్గాలు తెలిపాయంటూ ఓ వార్తా సంస్థ కథనాన్ని పబ్లిష్ చేసింది.


Similar News