Army Chief: ఇరు దేశాల మధ్య నమ్మకం కుదరాలి.. ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది

వాస్తవ నియంత్రణ రేఖ వద్ద భారత్, చైనా మధ్య కుదిరిన పెట్రోలింగ్ ఒప్పందంపై భారత ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేదీ స్పందించారు.

Update: 2024-10-22 10:46 GMT

దిశ, నేషనల్ బ్యూరో: వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఏసీ) వద్ద భారత్, చైనా మధ్య కుదిరిన పెట్రోలింగ్ ఒప్పందంపై భారత ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేదీ స్పందించారు. ముందుగా రెండు దేశాలు ఒకరిపై ఒకరు నమ్మకాన్ని పెంచుకోవాలని తెలిపారు. దీనికి చాలా సమయం పడుతుందని నొక్కి చెప్పారు. ఢిల్లీలో మంగళవారం ‘డికేడ్ ఆఫ్ ట్రాన్స్‌ఫర్మేషన్: ఇండియన్ ఆర్మీ ఇన్ స్ట్రైడ్ విత్ ది ఫ్యూచర్’ పేరుతో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎల్ఏసీ వద్ద 2020కి ముందున్న యథాతథ స్థితికి తిరిగి వెళ్లాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. ప్రస్తుతం ఆ నమ్మకాన్ని పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తామని తెలిపారు. సైన్యాన్ని ఉపసంహరించుకోవడం, బఫర్ జోన్ నిర్వహణ కూడా ఎంతో ముఖ్యమైందని స్పష్టం చేశారు. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించడానికి తగిన చర్యలు అవసరమని అభిప్రాయపడ్డారు. పెట్రోలింగ్ కార్యకలాపాలు ఇరువర్గాలకు ఒకరికొకరు భరోసా ఇవ్వడానికి అవకాశం కల్పిస్తున్నాయని తెలిపారు.


Similar News