హాలీవుడ్ హీరోలా ఉండే రతన్ టాటా పెళ్లి ఎందుకు చేసుకోలేదంటే..?

భారత పారిశ్రామికవేత్తల్లో రతన్ టాటా.. ముందు వరుసలో ఉంటారు. వందల సంఖ్యలో కంపెనీలు, లక్షల్లో ఉద్యోగులు, వేల కోట్ల సంపద ఉన్న రతన్ టాటా 86 ఏళ్ల వయస్సులో కన్నుమూశారు.

Update: 2024-10-10 05:08 GMT

దిశ, వెబ్ డెస్క్: భారత పారిశ్రామికవేత్తల్లో రతన్ టాటా.. ముందు వరుసలో ఉంటారు. వందల సంఖ్యలో కంపెనీలు, లక్షల్లో ఉద్యోగులు, వేల కోట్ల సంపద ఉన్న రతన్ టాటా 86 ఏళ్ల వయస్సులో కన్నుమూశారు. కాగా వేల కోట్ల ఆస్తి ఉన్నప్పటికి తాను పెళ్లి చేసుకోకుండా.. జీవితాంతం ఒంటరిగానే బ్రతికాడు. అయితే ఆయన మృతి చెందిన వేళ.. టాటా ఎందుకు పెళ్లి చేసుకోలేదని.. ఆయన తర్వాత వారసులు ఎవరనే ప్రశ్న దేశ ప్రజలను కలిచివేస్తుంది.

అయితే రతన్ టాటా తాను పెళ్లి చేసుకోకుండా ఉండటానికి అసలు కారణం ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన్ను యాంకర్ మీరు పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఏంటి అని ప్రశ్నించగా.. తాను యుక్త వయస్సులో ఉన్న సమయంలో అమెరికాలో ఓ యువతితో ప్రేమలో పడ్డానని, అప్పట్లో ఆమెను పెళ్లి చేసుకునేందుకు సిద్ధం అయ్యానని, కానీ వ్యక్తిగత కారణాల చేత భారత్ కి తిరిగి రావాల్సి వచ్చింది. అదే సమయంలో భారత్- చైనా యుద్ధం జరిగింది. దీంతో ఆ యువతిని భారత్ పంపడానికి ఆమె తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. దీంతో మా పెళ్లి ఆగిపోయిందని చెప్పుకొచ్చారు.


Similar News