Shashi Tharoor : ఎగ్జిట్ పోల్స్‌ను ‌మేం సీరియస్ తీసుకోం.. 8న అన్నీ తెలిసిపోతాయ్ : శశిథరూర్

దిశ, నేషనల్ బ్యూరో : హర్యానా, జమ్మూకశ్మీర్‌‌లలో కాంగ్రెస్ హవా వీయనుంది అంటూ వచ్చిన ఎగ్జిట్ పోల్స్‌పై హస్తం పార్టీ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-10-06 19:17 GMT

దిశ, నేషనల్ బ్యూరో : హర్యానా, జమ్మూకశ్మీర్‌‌లలో కాంగ్రెస్ హవా వీయనుంది అంటూ వచ్చిన ఎగ్జిట్ పోల్స్‌పై హస్తం పార్టీ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము ఎగ్జిట్ పోల్స్‌ను చాలా సీరియస్‌గా తీసుకోమని స్పష్టం చేశారు. ‘‘ఈసారికి మేం గెలుస్తామని జోస్యం చెప్పారు. చూద్దాం అక్టోబరు 8న అన్నీ తెలిసిపోతాయ్’’ అని ఆయన కామెంట్ చేశారు.

అయితే ఇతర కాంగ్రెస్ సీనియర్ నేతలు మాత్రం ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను స్వాగతించారు. బీజేపీ సైద్ధాంతిక భావజాలాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నందునే కాంగ్రెస్‌కు పట్టం కడుతున్నారని వారు పేర్కొన్నారు. ఎగ్జిట్ పోల్స్ వెలువడిన తర్వాత హర్యానా సీఎం, బీజేపీ నేత నయాబ్ సింగ్ సైనీ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ఏ ఒక్క పార్టీ మద్దతు అక్కర్లేకుండానే మేం హర్యానాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం’’ అని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.


Similar News