సిటీలో డర్టీ పార్టీ.. భార్యలను, గర్ల్ ఫ్రెండ్స్‌ను మార్చుకోని శృంగారం

సభ్య సమాజం తలగించుకునేలా నేటి యువత వ్యవహరిస్తోంది. బంధం, రక్త సంబంధం అనే తేడా లేకుండా జుగుప్సాకరంగా ప్రవర్తిస్తోంది.

Update: 2024-12-21 14:19 GMT

దిశ, వెబ్‌డెస్క్ : బంధం, రక్త సంబంధం అనే తేడా లేకుండా జుగుప్సాకరంగా ప్రవర్తిస్తున్నారు కొందరు. తన అవసరం, ఆనందం కోసం ఎంతటి నీచమైన పనైనా చేస్తున్నారు. ఇదే కోవలో బెంగళూరులో బయటపడ్డ ఓ ప్రైవేట్ పార్టీ అందరినీ షాక్‌కు గురి చేసింది. భార్యలను, గర్ల్ ఫ్రెండ్స్‌ను మార్చుకోని శృంగారం చేయడమే ఈ డర్టీ పార్టీ స్పెషల్. ఒకరి భాగస్వామిని మరొకరు మార్చుకోని రాత్రంతా సుఖాన్ని అనుభవించడమే లక్ష్యంగా ఈ పార్టీలు నిర్వహిస్తున్నారు. తాజాగా ఓ మహిళ ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేయడంలో ఈ గలీజ్ పార్టీ కల్చర్ బయటపడింది. సెంట్రల్ క్రైమ్ బ్రాంచి (CCB) పోలీసులు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.

కర్ణాటకకు చెందిన హరీష్, హేమంత్ కలిసి బెంగళూరులో భార్యలను, లవర్స్‌ను ఇచ్చిపుచ్చుకోవడం, వారితో నచ్చిన విధంగా గడపడం లాంటి డర్టీ గేమ్స్ నిర్వహిస్తున్నారు. ప్రైవేట్ పార్టీల పేరుతో వీరిద్దరు ఈ గేమ్స్ నిర్వహిస్తున్నారు. దీనికి డబ్బున్న ప్రముఖులు, సాఫ్ట్ వేర్ ఉద్యోగులు, బిజినెస్ మెన్లు విరివిగా వస్తున్నారు. అయితే ఓ వ్యక్తి తన భార్యను మరో వ్యక్తితో గడపాలని కోరడంతో షాక్‌కు గురై తిరస్కరించింది. దీంతో భర్త ఆమెతో గడిపిన శృంగార వీడియోలను, నగ్న చిత్రాలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరించి ఒప్పించే ప్రయత్నం చేశాడు. పార్టీకి తీసుకెళ్లి మరో వ్యక్తితో బలవంతంగా శృంగారం చేసేలా ఫోర్స్ చేశాడు. అక్కడి నుంచి తప్పించుకున్న ఆ మహిళ సీసీబీ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

చాకచక్యంగా దాడి చేసిన క్రైం బ్రాంచ్ పోలీసులు హరీష్, హేమంత్‌ అనే ఇద్దరు నిర్వహకులను అదుపులోకి తీసుకున్నారు. వీళ్లు మహిళలను బలవంతపెట్టి, బ్లాక్ మెయిల్ చేసి ఈ రొంపిలోకి దింపుతున్నారని పోలీసులు గుర్తించారు. కొందరు కొత్త అనుభూతి కోసం, మరి కొందరు ప్రమోషన్లు, బిజినెస్ డీల్స్ కోసం ఈ డర్టీ పార్టీలకు హాజరవుతున్నారని పోలీసుల విచారణలో తేలింది. అయితే బెంగళూరులో ఇదే మొదటి కేసు కాదని గతంలోనూ సిటీ శివారులో ఇలాంటి పార్టీలు జరిగాయని ఓ పోలీస్ అధికారి తెలిపారు. దీని కోసం ప్రత్యేకంగా వాట్సప్ గ్రూపులను కూడా నడుపుతున్నారని ఆయన చెప్పారు. ముందస్తు పధకం ప్రకారమే భాగస్వాములు భార్యల, గర్ల్ ఫ్రెంట్స్ నగ్న ఫొటోలు, వీడియోలు తీసిపెట్టుకుని పార్టీకి ఆహ్వానిస్తారని, అక్కడికి వెళ్లాక మరొకరితో గడపాలని ఒత్తిడి తెస్తారని తెలిపారు. ఒప్పుకోకపోతే వారి నగ్న చిత్రాలను వైరల్ చేస్తామని బ్లాక్ మెయిల్ చేస్తారని వెల్లడించారు. ఈ కారణంగానే కొంతమంది మహిళలు బలి అవుతున్నారని పేర్కొన్నారు. నిందితుల నుంచి పలువురు మహిళలకు చెందిన ఫొటోలు, వీడియోలను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ డర్టీ పార్టీకి హాజరైన వారిపైనా ఫోకస్ చేసినట్టు ఆ అధికారి చెప్పారు.


Similar News