గుర్తుతెలియని మృతదేహం లభ్యం

గుర్తుతెలియని మృతదేహం మర్కుక్ మండలంలోని కర్కపట్ల గ్రామంలో ని ఏరాయి చెరువులో లభ్యం అయినట్లు మర్కు క్ ఎస్సై దామోదర్ తెలిపారు.

Update: 2024-12-21 16:24 GMT

దిశ, ములుగు : గుర్తుతెలియని మృతదేహం మర్కుక్ మండలంలోని కర్కపట్ల గ్రామంలో ని ఏరాయి చెరువులో లభ్యం అయినట్లు మర్కు క్ ఎస్సై దామోదర్ తెలిపారు. శనివారం మర్కు క్ మండలంలోని కర్కపట్ల గ్రామ శివారులోని ఏరాయి చెరువులో మగ మనిషి మృతదేహం ఉన్నట్లు స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం తెలిపినట్లు ఆయన తెలిపారు. మృతదేహం వివరాలు తెలియ రావలసి ఉందని, మృతదేహాన్ని గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టు ఎస్సై తెలిపారు..మృతునికి బ్లూ, యాష్ కలర్ టి షర్ట్, బ్లాక్ నైట్ పాయింట్ ఉన్నట్టు గుర్తించినట్లు తెలిపారు. సుమారు రెండు రోజుల క్రితం మృతి చెంది ఉండవచ్చు అని ఆయన తెలిపారు.


Similar News