కౌలు రైతు ఆత్మహత్య

జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం వెంకట్రావు పేట గ్రామంలో కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు.

Update: 2024-12-21 16:00 GMT

దిశ, మల్లాపూర్ : జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం వెంకట్రావు పేట గ్రామంలో కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. వెంకట్రావు పేట గ్రామానికి చెందిన మిట్టపల్లి జీవన్ రెడ్డి (40), సుజాత దంపతులు. వీరికి కుమారుడు, కూతురు ఉన్నారు. జీవన్ రెడ్డి భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. వ్యవసాయంలో పెట్టిన పెట్టుబడి రాక అప్పుల పాలయ్యాడు. దీంతో మనస్థాపానికి గురై శనివారం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య సుజాత ఫిర్యాదు మేరకు ఎస్సై కొసన రాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Similar News