Russia-Ukraine: దేవుడు మావైవే ఉన్నాడు.. ఉక్రెయిన్ పై గెలుస్తాం- పుతిన్

రష్యా- ఉక్రెయిన్‌ (Russia-Ukraine)ల మధ్య ఇప్పటికీ యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇలాంటి సమయంలో సుప్రీం యూరేషియన్ ఎకనామిక్ కౌన్సిల్‌ (SEEC)లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (vladimir putin) కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-12-27 10:24 GMT

దిశ, నేషనల్ బ్యూరో: రష్యా- ఉక్రెయిన్‌ (Russia-Ukraine)ల మధ్య ఇప్పటికీ యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇలాంటి సమయంలో సుప్రీం యూరేషియన్ ఎకనామిక్ కౌన్సిల్‌ (SEEC)లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (vladimir putin) కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధంలో తామే గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ‘నేను దేవుడ్ని నమ్ముతాను. దేవుడు మావైపే ఉన్నాడు. ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో 2025లో రష్యా తప్పక విజయం సాధిస్తుంది. ఇదే విషయాన్ని మా నివేదికలు కూడా చెబుతున్నాయి. ఉక్రెయిన్‌కు నాటోలో సభ్యత్వం కల్పించడాన్ని ఆలస్యం చేసే బదులు యుద్ధాన్నే ముగించాలని అమెరికా ఆలోచిస్తున్నట్లు వస్తున్న వార్తలను ఖండించారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) 2021లోనూ ఇదే ప్రతిపాదన చేశారు. ఆ ప్రతిపాదన మాస్కోకు ఆమోదయోగ్యంగా లేదని తేల్చిచెప్పాం. యుద్ధాన్ని ఆపాలనే మేము ప్రయత్నిస్తున్నాం. దీనిలో మేము విజయం సాధిస్తాం. ఆర్థికరంగంలో మా లక్ష్యాలను సాధించడంతో పాటు సామాజిక సమస్యలు సహ సైనిక భద్రతకు సంబంధించిన ఇతర ఇబ్బందులను పరిష్కరిస్తాం’ అని తెలిపారు.

ట్రంప్ ప్రకటన వెలువడిన తర్వాతే..

ఇకపోతే, అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్(US President-elect Donald Trump) అధికారం చేపట్టిన కొద్ది గంటల్లోనే రష్యా, ఉక్రెయిన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదుర్చుకుంటానని ఇటీవలే ప్రకటించారు. ట్రంప్ ప్రకటించిన కొన్ని గంటల్లోనే రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అయితే, ఇప్పటివరకు ఇరువురు నేతలు ఎలాంటి ప్రతిపాదన వివరాలను వెల్లడించలేదు. మరోవైపు, కీవ్‌తో శాంతి చర్చలు నిర్వహించాలనే స్లొవేకియా ప్రతిపాదనను కూడా స్వాగతిస్తునట్లు పేర్కొన్నారు. డిసెంబరు 22న క్రెమ్లిన్‌లో స్లోవేకియా ప్రధాని రాబర్ట్ ఫికోతో పుతిన్ భేటీ అయ్యారు. ఆ సమయంలోనే రష్యా- ఉక్రెయిన్ చర్చల గురించి మాట్లాడారు. దానికి పుతిన్ అంగీకారం తెలిపారు.

Tags:    

Similar News