Manmohan Singh: అధికారిక లాంఛనాలతో మాజీ ప్రధాని అంత్యక్రియలు.. అధికారిక ఉత్తర్వులు విడుదల

అనారోగ్యంతో కన్నుమూసిన మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ (Manmohan Singh) అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నారు.

Update: 2024-12-28 03:02 GMT

దిశ, వెబ్‌డెస్క్: అనారోగ్యంతో కన్నుమూసిన మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ (Manmohan Singh) అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నారు. ఈ మేరకు ఉదయం 11.45కు ఢిల్లీలోని నిగమ్‌బోధ్ (Nigambodh) ఘాట్‌లో అంతిమ సంస్కారాలకు ఏర్పాటు చేస్తున్నట్లుగా కేంద్ర హోంశాఖ (Central Home Ministry) ఉత్తర్వులు జారీ చేసింది. అదేవిధంగా సైనిక లాంఛనాలతో తుది వీడ్కోలు పలికేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని కేంద్రం రక్షణ శాఖ (Department of Defense)ను కోరింది. అదేవిధంగా కార్యక్రమాల్లో పాల్గొనే ప్రముఖుల పేర్లతో ఓ ప్రకటన విడుదలైంది. ప్రస్తుతం మాజీ ప్రధాని మ‌న్మోహ‌న్ సింగ్ (Manmohan Singh) పార్థీవ దేహం ఆయన నివాసంలో ఉంది.

అయితే, ప్రజల సందర్శనార్థం భౌతికకాయాన్ని కాంగ్రెస్ (Congress) ముఖ్య నేటలు మరికొద్దిసేపట్లోనే ఏఐసీసీ (AICC) ప్రధాన కార్యాలయానికి తరలించనున్నారు. అక్కడి నుంచే మన్మోహన్‌సింగ్‌ (Manmohan Singh) అంతిమయాత్ర ప్రారంభం కానుంది. మరోవైపు మన్మోహన్‌సింగ్‌ అంత్యక్రియలను వీర్‌ భూమి (Veer Bhumi) లేదా శక్తి స్థల్‌ (Shakthi Sthal)లో కొంత భాగం కేటాయించాలని కాంగ్రెస్ నేతలు రిక్వెస్ట్ చేశారు. అక్కడే ఆయన సమాధిని కూడా నిర్మించాలని కోరారు. అందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించకపోవడంతో కాంగ్రెస్‌ నేతలు తీవ్ర అసహనం చేస్తున్నారు. ఓ మాజీ ప్రధానిని బీజేపీ ప్రభుత్వం అవమానిస్తోందని ఫైర్ అవుతున్నారు.

 

Tags:    

Similar News