Vinesh Phogat: అదంతా ఫోటో కోసం నాటకమే.. పీటీ ఉషపై వినేశ్ ఫోగాట్ సంచలన ఆరోపణలు

పారిస్ ఒలింపిక్స్ లో రాజకీయం జరిగిందని వినేశ్ ఫోగాట్ సంచలన ఆరోపణలు గుప్పించారు.

Update: 2024-09-11 05:34 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగాట్ ఇటీవలే రాజకీయ రంగ ప్రవేశం చేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న ఆమెకు హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో జులానా నియోజకవర్గం నుంచి ఆమె బరిలోకి దిగుతున్నారు. అయితే వినేశ్ ఫోగాట్ పొలిటికల్ ఎంట్రీపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్న తరుణంలో భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్షురాలు పీటీ ఉష పై వినేశ్ ఫోగాట్ సంచలన ఆరోపణలు చేశారు. పారిస్ ఒలింపిక్స్ రెజ్లింగ్ ఫైనల్ నుంచి వినేశ్ అనర్హత వేటుకు గురి అయ్యాక ఒలింపిక్ విలేజ్ మెడికల్ సెంటర్ లో ఆమెను పిటీ ఉష పరామర్శించారు. వినేశ్ భుజంపై పీటీ ఉష చెయ్యి ఉంచి ధైర్యం చెప్పినట్లుగా ఓ ఫోటో సైతం బయటకు వచ్చింది. అయితే ఇదంతా నాటకం అని వినేశ్ ఆరోపించారు. అనర్హత వేటు పడిన సమయంలో పీటీ ఉష నుంచి తనకు ఎలాంటి మద్దతు రాలేదని, ఫోటోల కోసమే పీటీ ఉష తన దగ్గరకు వచ్చారని విమర్శించారు. నాకు తెలియకుండానే ఫోటోలు తీసి నాకు వారి మద్దతు ఉన్నట్లుగా నటించారని విమర్శలు గుప్పించింది. తాజాగా ఓ మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన వినేశ్ అందులో ఈ వ్యాఖ్యలు చేసింది. పారిస్ లో నాకు ఎలాంటి మద్దతు లంభించిందో నాకే తెలియదు. పీటి ఉష మేడం నన్ను ఆసుపత్రిలో సందర్శించారు. ఒక ఫోటో క్లిక్ మనిపించారు. అయితే మీరు చెప్పినట్లుగా రాజకీయాల్లో చాలా అంశాలు మూసుకుపోయి ఉంటాయి. అలాగే పారిస్ లో కూడా రాజకీయాలు జరిగాయి. అందుకే గుండె పగిలిపోయిందన్నారు. చాలా మంది రెజ్లింగ్ ను వదిలిపెట్టవద్దని సూచిస్తున్నారు. ప్రతి చోట రాజకీయాలు ఉంటే నేను దేని కోసం ఆటను కొనసాగించాలని ఆవేదన వ్యక్తం చేశారు. పీటీ ఉషపై వినేశ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. 


Similar News