Suryakanta Vyas: బీజేపీ సీనియర్ నేత సూర్యకాంత వ్యాస్ కన్నుమూత
సీనియర్ బీజేపీ నాయకురాలు సూర్యకాంత వ్యాస్ కన్నుమూశారు. 86 ఏళ్ల సూర్యకాంత వ్యాస్ ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
దిశ, నేషనల్ బ్యూరో: సీనియర్ బీజేపీ నాయకురాలు సూర్యకాంత వ్యాస్ కన్నుమూశారు. 86 ఏళ్ల సూర్యకాంత వ్యాస్ ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె బుధవారం తుదిశ్వాస విడిచినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. 'జీజీ' అని పిలుచుకునే సూర్యకాంత వ్యాస్ ఫిబ్రవరి 23, 1938న జన్మించారు. రాజకీయ జీవితంలో అనేక పదవులను నిర్వహించారు.1969లో బీజేపీ జోధ్‌పూర్ సిటీ యూనిట్ ఉపాధ్యక్షురాలిగా జన్ సంఘ సభ్యురాలిగా రాజకీయ ప్రస్థఆనం ప్రారంభించారు. సూర్యకాంత వ్యాస్ 1977- 1980 వరకు జోధ్‌పూర్ జిల్లా జనతా పార్టీకి అధ్యక్షురాలిగా కొనసాగారు. 1972, 1983లో మున్సిపల్ కౌన్సిలర్‌గా ఎన్నికైన ఆమె.. 1990, 1993, 2003, 2008, 2013, 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. వయోభారం కారణంగా ఆమెకు 2023 అసెంబ్లీ ఎన్నికలకు సూరసాగర్ నియోజకవర్గం నుంచి టికెట్ దొరకలేదు.
ప్రముఖుల సంతాపం
అంతేకాకుండా రామజన్మభూమి ఆలయ నిర్మాణం కోసం మహిళా సంఘానికి నాయకత్వం వహించడంతో పాలు పలు సత్యాగ్రహాల్లో పాల్గొన్నందుకు అనేకసార్లు జైలుకెళ్లారు. ఆమెకు ప్రధానమంత్రి నరేంద్రమోడీతో కూడా సాన్నిహిత్యం ఉంది. జీజీ మృతిపై రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాత్ సంతాపం వ్యక్తం చేశఆరు. జీజీ మరణం విచారకరం అని సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. జీజీ మృతి బీజేపీకి తీరని లోట్ అని రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ అన్నారు.