Congress asks PM Modi: సాగు చట్టాల రద్దు తర్వాత రైతులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?

హర్యానా అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఎన్డీఏ ప్రభుత్వంపై కాంగ్రెస్‌ (Congress) తీవ్ర విమర్శలు గుప్పించింది.

Update: 2024-09-25 09:54 GMT

దిశ, నేషనల్ బ్యూరో: హర్యానా అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఎన్డీఏ ప్రభుత్వంపై కాంగ్రెస్‌ (Congress) తీవ్ర విమర్శలు గుప్పించింది. మోడీ సర్కార్‌పై హర్యానా ప్రజలు నమ్మకం కోల్పోయారని ఆరోపించింది. కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ప్రధాని మోడీకి ప్రశ్నలు సంధించాడు. రైతుల జీవనంపై బీజేపీకి ఉన్న విజన్ ఏంటి అని ప్రశ్నించారు. ‘‘2021లో సాగు చట్టాలు రద్దు చేసిన తర్వాత కేంద్రం రైతులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి..? వారి డిమాండ్లు తీరుస్తామని ఎక్కడికి వెళ్లారు..? మోడీ సర్కార్‌పై హర్యానా రైతులు పూర్తిగా నమ్మకం కోల్పోయారు’’ అని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు జైరాం రమేశ్‌ (Jairam Ramesh) విమర్శించారు. ‘‘రైతులను బీజేపీ మోసం చేసింది. రైతులు గొంతు నొక్కారు. తమ గొంతుకను వినిపించేందకు మరోసారి వీధుల్లోకి వాల్సి వచ్చింది. వారిపైన లాఠీఛార్జ్ చేశారు. వాటర్ కెనాన్లను వాడారు. అన్నదాతల సమస్యలను బీజేపీ ఎందుకు పట్టించుకోవట్లేదు. రైతుల జీవనం, అభివృద్ధిపై బీజేపీకి ఉన్న విజన్‌ ఏమిటి..?’’ అని జైరాం రమేశ్ ప్రశ్నించారు. ఇకపోతే, తమ పార్టీ అధికారంలోకి వస్తే కనీస మద్దతు ధరపై చట్టపరమైన హామీ ఇస్తుందని జైరాం రమేశ్ అన్నారు. రుణ మాఫీతో పాటు 30 రోజుల్లోగా పంట బీమా చెల్లిస్తామని పేర్కొన్నారు.

కనీస మద్దతు ధర చెల్లిస్తాం

‘‘బీజేపీ మహిళల భద్రతపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. హర్యానా కుమార్తెలైన మహిళా రెజ్లర్లపై బీజేపీ నుంచి ఎంపీగా ఎన్నికైన బ్రిజ్ భూషణ్ వేధింపులకు పాల్పడ్డాడు. అయన్ని శిక్షించకుండా అతడి కుమారుడికి టికెట్ ఇచ్చింది. లైంగిక వేధింపులకు పాల్పడే వారికి బీజేపీ ఆశ్రయం కల్పిస్తుంది. ‘మోడీ కా పరివార్‌’లో నారీ శక్తి అనేది కేవలం నినాదం మాత్రమే అని.. మోడీ సర్కారులో మహిళలు సురక్షితంగా ఉన్నారా?’’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.


Similar News