landslides: కొండచరియలు విరిగిపడి 13 మంది మృతి.. ఉగాండాలో విషాదం

ఆఫ్రికా దేశమైన ఉగాండాలో విషాదం చోటు చేసుకుంది. కొండచరియలు విరిగిపడి 13మంది ప్రాణాలు కోల్పోయారు.

Update: 2024-11-28 19:16 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఆఫ్రికా దేశమైన ఉగాండా(Uganda)లో విషాదం చోటు చేసుకుంది. కొండచరియలు (Landslides) విరిగిపడి 13మంది ప్రాణాలు కోల్పోయారు. తూర్పు ఉగాండాలోని పర్వత ప్రాంతమైన బులంబులి (Bulambuli)లో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడ్డట్టు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో 40 ఇళ్లు పూర్తిగా ధ్వంసం అయినట్టు వెల్లడించారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. శిథిలాల కింద అనేక మంది చిక్కుకున్నారని మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని స్థానిక కథనాలు పేర్కొన్నాయి. సుమారు 30 మంది మరణించే అవకాశం ఉందని తెలిపాయి. ప్రభావిత ప్రాంతం సుమారు 50 ఎరకాల మేర ఉంటుందని, వర్షాలు తగ్గకపోవడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. మృతి చెందిన వారిలో అనేక మంది పిల్లలే ఉన్నట్టు తెలుస్తోంది. దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రధాన రహదారులు తెగిపోవడంతో జనజీవనం స్తంభించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం విపత్తు హెచ్చరిక జారీ చేసింది.

Tags:    

Similar News