Attempt to derail train: గుజరాత్ లో రైలు ప్రమాదానికి కుట్ర

గుజరాత్ లో రైలు ప్రమాదానికి కుట్ర జరిగింది.బొటాడ్ జిల్లా కుండ్రి గ్రామ సమీపంలో రైలుని పట్టాలు తప్పించేందుకు కుట్ర జరిగింది.

Update: 2024-09-25 09:59 GMT

దిశ, నేషనల్ బ్యూరో: గుజరాత్ లో రైలు ప్రమాదానకి కుట్ర జరిగింది.బొటాడ్ జిల్లా కుండ్రి గ్రామ సమీపంలో రైలుని పట్టాలు తప్పించేందుకు కుట్ర జరిగింది. ట్రైక్ పై పడివున్న రైలు పట్టాని ఢీకొన్న ప్యాసింజర్ రైలు అక్కడే నిలిచిపోయింది. బొటాడ్‌లోని రాన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఓఖా భావ్‌నగర్ ప్యాసింజర్ రైలు అర్థరాత్రి సుమారు 3 గంటల పాటు పట్టాలపైనే నిలిచిపోయింది. ట్రాక్‌పై ఎవరో నాలుగు అడుగుల పొడవైన పాత ట్రాక్‌ భాగాన్ని ఉంచారని ప్రయాణికులు తెలిపారు. దీనిని ఢీకొన్న గూడ్సు రైలు అక్కడే ఆగిపోయింది. రైల్వే అధికారులు, ఆర్పీఎఫ్, రాన్ పూర్ పోలీసులు ఘటనాస్థలంలో దర్యాప్తు చేపట్టారు. పట్టాలను సరిచేసి, మరో ఇంజిన్‌ సాయంతో ఆ రైలును అక్కడి నుంచి ముందుకు పంపించారు. రైల్వే పోలీసులు, అధికారులు పరిస్థితిని చక్కదిద్ది, తిరిగి రైళ్లు యథావిథిగా నడిచేలా చూశారు. రాన్‌పూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సెప్టెంబర్ నెలలోనే ఐదో ఘటన

ఇటీవలి కాలంలో రైళ్లను పట్టాలు తప్పించేందుకు కుట్రలు జరుగుతున్నాయనే ఉన్నాయి. ఇకపోతే, సెప్టెంబరు నెలలోనే రైళ్లను పట్టాలు తప్పించేందుకు ప్రయత్నించిన ఐదో ఘటన ఇది. రెండ్రోజుల క్రితం పంజాబ్‌లోని బఠిండాలో రైలు ప్రమాదానికి కుట్ర జరిగింది. గూడ్స్ రైలు వెళ్లాల్సిన రైల్వే ట్రాక్‌పై ఇనుప రాడ్‌లు కనిపించాయి. సెప్టెంబర్ 22న ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ జిల్లాలోని పెరంబూర్ రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలపై సిలిండర్ ని అధికారులు గుర్తించారు. గూడ్స్ రైలు లోకో పైలట్ సకాలంలో బ్రేకులు వేయడంతో పెను ప్రమాదం తప్పింది.


Similar News