ఈ కామర్స్ ప్రకటనలపై కొరడా ఝుళిపించనున్న కేంద్రం

భారత్(Bharat) లో రానున్న పండగల సీజన్ కోసం ఈ కామర్స్(e-commerce) సంస్థలు ప్రకటనల ప్రవాహానికి తెరలేపాయి.

Update: 2024-09-25 10:59 GMT

దిశ, వెబ్ డెస్క్ : భారత్(Bharat) లో రానున్న పండగల సీజన్ కోసం ఈ కామర్స్(e-commerce) సంస్థలు ప్రకటనల ప్రవాహానికి తెరలేపాయి. ప్రకటనలకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకున్నాయి. అయితే తప్పుడు ప్రకటనలు చేస్తే చర్యలు తప్పవంటూ కేంద్ర ప్రభుత్వం ఈ కామర్స్ సైట్స్ మీద సీరియస్ అయింది. ఆకర్షణీయమైన ఆఫర్ల పేరుతో వినియోగదారులను పక్కదారి పట్టిస్తే ఊరుకునేది లేదని కేంద్ర వినియోగదారుల మంత్రిత్వ శాఖ తేల్చి చెప్పింది. కొన్ని ఈ కామర్స్ సంస్థలు రూ. 1 కే ఐఫోన్(IPhone) లాంటి పలు ఖరీదైన వస్తువుల గురించి అబద్దపు ప్రకటనలు ఇస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని, అలాంటి సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. తప్పుదోవ పట్టించే, మోసపూరిత ప్రకటనలు చేసే ఈ కామర్స్ సైట్స్ గురించి తమకు ఫిర్యాదు చేయాలని వినియోగదారులకు సూచించింది. అలాగే మోసపూరిత ప్రకటనలు చూసి, ఆయా సైట్స్ లోకి వెళ్ళి డబ్బులు పోగొట్టుకోవద్దని కేంద్ర ప్రభుత్వం హితవు పలికింది. 


Similar News