Congress: మోడీ మళ్లీ క్షమాపణ చెప్పాల్సి వస్తుంది.. రాహుల్ గాంధీ సంచలన ట్వీట్
ప్రభుత్వ విధానాలను నిర్ణయించేది మోడీనా? ఎంపీనా?.. ఇలాగే జరిగితే ప్రధాని మరోసారి క్షమాపణ చెప్పాల్సి వస్తుందని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు.
దిశ, డైనమిక్ బ్యూరో: ప్రభుత్వ విధానాలను నిర్ణయించేది మోడీనా? ఎంపీనా?.. ఇలాగే జరిగితే ప్రధాని మరోసారి క్షమాపణ చెప్పాల్సి వస్తుందని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. రద్దు చేసిన సాగు చట్టాల పట్ల బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పిన ఆమె తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే రైతుల మరణాలను ప్రస్తావిస్తూ రాహుల్ గాంధీ స్పందించడం సంచలనంగా మారింది. ట్విట్టర్ వేదికగా ఆయన.. గవర్నమెంట్ పాలసీలను ఎవరు నిర్ణయిస్తారు? బీజేపీ ఎంపీనా లేక ప్రధాని మోదీనా? అని ప్రశ్నించారు. అలాగే 700 మందికి పైగా రైతులు, ముఖ్యంగా హర్యానా, పంజాబ్‌ల రైతులు బలిదానం చేసినా బీజేపీ నాయకులు సంతృప్తి చెందలేదని విమర్శల వర్షం గుప్పించారు. అంతేగాక రైతులకు వ్యతిరేకంగా బీజేపీ చేసే ఏ కుట్రలను విజయవంతం చేయడానికి ఇండియా కూటమి అనుమతించదని అన్నారు. ఇక రైతులకు హాని కలిగించే చర్యలు తీసుకుంటే, మోడీ మళ్ళీ క్షమాపణ చెప్పాల్సి వస్తుందని రాహుల్ గాంధీ అన్నారు.