Ajit Pawar : సీఎం అవ్వాలని ఎవరికి ఉండదు.. అజిత్ పవార్

త్వరలో మహారాష్ట్ర(Maharashtra) అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో డిప్యూటీ సీఎం, ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్Ajith (Pawar) సీఎం కుర్చీపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-09-25 13:47 GMT
Ajit Pawar : సీఎం అవ్వాలని ఎవరికి ఉండదు.. అజిత్ పవార్
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్ : త్వరలో మహారాష్ట్ర(Maharashtra) అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో డిప్యూటీ సీఎం, ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్(Ajith Pawar) సీఎం కుర్చీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ముఖ్యమంత్రి అవ్వాలని ఉందని తన మనసులో మాటను బయటపెట్టారు. ఓ మీడియా కార్యక్రమంలో పాల్గొన్న అజిత్ పవార్.. ముఖ్యమంత్రి కావాలనే ఆశ ఉన్నప్పటికీ, అవకాశం రాక ఉప ముఖ్యమంత్రి పదవి దగ్గరే ఆగిపోయాను అన్నారు. ఏ నేతకైనా సీఎం అవ్వాలని ఉంటుంది కానీ అన్నిసార్లు కుదరదు, అది కేవలం ఓటర్ల చేతిలో ఉంటుందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని 288 సీట్లకు గానూ 145 సీట్లు దక్కించుకుంటే ఆ కుర్చీ మీద ఆశపడే అవకాశం ఉంటుందని అజిత్ పవార్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుత సీఎం ఏక్ నాథ్ షిండే ఎన్నికల్లో గెలిచి మరోసారి సీఎం పదవిని చేపట్టాలని చూస్తుంటే.. ఉప ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్.. అజిత్ పవార్ లు కూడా ముఖ్యమంత్రి పీఠంపై ఆసక్తి ప్రదర్శిస్తున్నట్టు ఈ మధ్య కాలంలో వారి మాటలను బట్టి తెలుస్తుంది.   

Tags:    

Similar News