పహల్గామ్ దాడిపై రాబర్ట్ వాద్రా అనూహ్య వ్యాఖ్యలు.. క్లారిటీ

ఈ నెల 22న కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిపై రాబర్ట్ వాద్రా చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా దుమారం రేపాయి.

Update: 2025-04-28 06:10 GMT
పహల్గామ్ దాడిపై రాబర్ట్ వాద్రా అనూహ్య వ్యాఖ్యలు.. క్లారిటీ
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: ఈ నెల 22న కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి (terrorist attack)పై రాబర్ట్ వాద్రా (Robert Vadra) చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా దుమారం రేపాయి. ఆయన ఉగ్రదాడిపై మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం హిందుత్వ ఎజెండగా పనిచేయడంతోనే ఉగ్రవాదులు కేవలం హిందువులను చంపారని సంచలన వ్యాఖ్యలు (Sensational comments) చేశారు. ఈ వ్యాఖ్యలతో దేశవ్యాప్తంగా ఆతనిపై వ్యతిరేకత మొదలైంది. భారత దేశంపై జరిగిన దాడిని రాబర్ట్ వాద్రా ఇలా మాట్లాడటం సరైందికాదని, వెంటనే ఆయన క్షమాపణలు చెప్పాలని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో పహల్గామ్ దాడిపై తాను చేసిన వ్యాఖ్యలపై రాబర్ట్ వాద్రా స్పష్టత ఇచ్చారు. తన ఉద్దేశాలను 'తప్పుగా అర్థం చేసుకున్నారని' అన్నారు. సోమవారం ఉదయం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. పహల్గామ్ దాడి (Pahalgam attack)ని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని వాద్రా పేర్కొన్నారు.

మొదట తాను చేసిన వ్యాఖ్యలను "నా ఉద్దేశాలను తప్పుగా అర్థం చేసుకున్నందున, వాటిని స్పష్టం చేయడం తన బాధ్యత అన్నారు. నిజాయితీ, పారదర్శకత, గౌరవంతో నన్ను నేను స్పష్టం చేసుకోవడానికి కట్టుబడి ఉన్నాను. నేను కొన్ని రోజులు మౌనంగా వేచి ఉండాలని నిర్ణయించుకున్నాను. నిజానికి, నా దేశం పట్ల నాకున్న ప్రేమ, సత్యం పట్ల నాకున్న గౌరవం, అంకితభావానికి నా నిబద్ధత కారణంగా నేను మాట్లాడే ముందు ఆలోచించడానికి సమయం తీసుకున్నాను. తాజా పరిస్థితుల్లో నా ఆలోచనలు ఏమిటో నేను స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇది అమాయక ప్రజల ప్రాణాలను బలిగొంది. వారి కుటుంబాలను ఛిన్నాభిన్నం చేసింది. నేను భారతదేశంతో నిలబడతాను. ఎల్లప్పుడూ అలాగే ఉంటాను అని చెప్పుకొచ్చారు.

Similar News