ఇండియాలో ప్రపంచంలోనే పెద్ద ఆఫీసు కాంప్లెక్సు.. ఎక్కడుందంటే..? (వీడియో)

ప్రపంచంలోనే అతిపెద్ద ఆఫీసు అమెరికాలోని పెంటగాన్‌.

Update: 2023-07-18 16:56 GMT

సూరత్ (గుజరాత్) : ప్రపంచంలోనే అతిపెద్ద ఆఫీసు అమెరికాలోని పెంటగాన్‌. అయితే దీన్ని మించిన ఆఫీసు కాంప్లెక్సును ప్రపంచ వజ్రాల రాజధానిగా పేరొందిన గుజరాత్‌లోని సూరత్‌లో నిర్మించారు. వజ్రాల వ్యాపారంలో కీలకంగా వ్యవహరించే కట్టర్లు, పాలిషర్లు, వ్యాపారస్థులు సహా 65,000 మంది బిజినెస్ చేసుకునేందుకు వీలుగా "సూరత్‌ డైమండ్‌ బర్స్‌" సంస్థ ఈ పేద్ద ఆఫీసును కట్టించింది. ఈ భవనాన్ని నిర్మించడానికి నాలుగేళ్ల సమయం పట్టింది. ఈ ఏడాది నవంబరులో ప్రధానమంత్రి నరేంద్రమోడీ దీన్ని ప్రారంభించనున్నారు. భారతీయ ఆర్కిటెక్చర్ సంస్థ మోర్ఫోజెనిసిస్ ఈ భవనాన్ని 35 ఎకరాల ప్లేస్ లో నిర్మించింది. 15 అంతస్తుల ఈ భవనం 9 దీర్ఘచతురస్రాకార నిర్మాణాలుగా విస్తరించి ఉంది. ఈ భవనాలన్నింటికి మధ్యలో ఒక భవనం అనుసంధానమై ఉంటుంది.

దీన్ని ఈ మొత్తం ఆఫీసు కాంప్లెక్స్‌కు వెన్నెముకగా చెప్పొచ్చు. ఈ బిల్డింగ్‌లోని ఫ్లోర్ స్థలం 68 లక్షల స్క్వేర్ ఫీట్లు ఉంటుంది. ఈ కాంప్లెక్స్‌లోని 20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో రిక్రియేషన్‌ జోన్‌తో పాటు పార్కింగ్‌‌ను కేటాయించారు. ‘‘నిర్మాణానికి ముందే ఈ కాంప్లెక్సులోని అన్ని కార్యాలయాలను డైమండ్‌ కంపెనీలు కొన్నాయి’’ అని సూరత్‌ డైమండ్‌ బర్స్‌ ప్రాజెక్టు సీఈవో మహేష్ గాధవి తెలిపారు. ఈ కార్యాలయాన్ని లాభాల కోసం ఏర్పాటు చేయలేదని స్పష్టం చేశారు.


Similar News