స్వాతి మలివాల్‌పై దాడి కేసు: కేజ్రీవాల్ పీఏ బిభవ్ కుమార్ అరెస్ట్

ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడైన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పీఏ బిభవ్ కుమార్‌ను అరెస్ట్ చేశారు.

Update: 2024-05-18 07:54 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడైన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పీఏ బిభవ్ కుమార్‌ను అరెస్ట్ చేశారు. శనివారం మద్యాహ్నం సీఎం నివాసంలోకి వెళ్లిన పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. విచారణ నిమిత్తం సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. కాగా, ఈనెల 13న కేజ్రీవాల్‌ను కలిసేందుకు స్వాతి మలివాల్ ఆయన నివాసంలో వేచి ఉండగా తనపై బిభవ్ కుమార్ దాడి చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. దీనిపై తీవ్ర రాజకీయ దుమారం రేగింది. ఈ విషయంపై 16వ తేదీన స్వాతి పోలీసులకు ఫిర్యాదు చేయగా..ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అనంతరం ఢిల్లీ పోలీసులు మలివాల్‌కు ఎయిమ్స్‌లో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ రిపోర్టులో మలివాల్ కండ్లు, కాళ్ళపై దెబ్బలు తాకినట్టు తేలింది. ఈ నేపథ్యంలో నివేదిక వచ్చిన కొన్ని గంటల్లోనే పోలీసులు బిభవ్‌ను అరెస్టు చేశారు. మరోవైపు ఘటనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో సీఎం ఇంటి వద్ద ఉన్న సిబ్బందికి, మలివాల్‌కు మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నట్టు కనిపిస్తోంది.

Tags:    

Similar News