ఇస్లామాబాద్: పాకిస్తాన్లో విషాదం చోటుచేసుకుంది. శుక్రవారం ఉచిత రేషన్ పంపిణీలో జరిగిన తొక్కిసలాటలో 11 మంది మరణించారని పోలీసులు తెలిపారు. కరాచీలో రంజాన్ ఆహార పంపిణీ కేంద్రంలో ఈ ఘటన జరిగినట్లు వెల్లడించారు. మరణించిన వారిలో 8 మంది మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు. ఒక్కసారిగా ప్రజలు పెద్ద ఎత్తున గుమిగూడడంతో తోపులాట జరిగినట్లు చెప్పారు. ఈ క్రమంలో ప్రజలు భయాందోళనకు గురి కావడంతో తొక్కిసలాట చోటుచేసుకుందని వెల్లడించారు.
ఈ క్రమంలో పక్కనే ఉన్న కాలువలో కొందరు పడిపోయారన్నారు. మరోవైపు ఈ తొక్కిసలాటకు కారణమైనట్లుగా అనుమానిస్తున్న ఏడుగురిని అదుపులో తీసుకున్నారు. దీనిపై దర్యాప్తు కూడా ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.