Manmohan Singh: నీచ రాజకీయాలు చేయడం మానుకోవాలి.. మన్మోహన్ స్మారకంపై బీజేపీ ఘాటు వ్యాఖ్యలు

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సేవలను స్మరించేందుకు స్మారకం నిర్మించేందుకు కేంద్రం రెడీ అయ్యింది. ఈ విషయాన్ని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రకటించింది.

Update: 2024-12-28 05:45 GMT

దిశ, నేషనల్ బ్యూరో: భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh) స్మారకం విషయంలో కేంద్రం కీలక ప్రకటన చేసింది. మాజీ ప్రధాని స్మారక చిహ్నం కోసం స్థలం కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన అభ్యర్థనకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఈ నేపథ్యంలో హోం మంత్రి అమిత్ షా, కేబినెట్ సమావేశం తర్వాత స్మారక చిహ్నం(Manmohan Singh Memorial) కోసం స్థల కేటాయింపుపై నిర్ణయాన్ని ప్రకటించారు. ఈ మేరక కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రకటనను విడుదల చేసింది. “ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ స్మారకం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ చీఫ్ ఖర్గే నుంచి శనివారం ఉదయం అభ్యర్థన వచ్చింది. కేబినేట్ మీటింగ్ జరిగిన వెంటనే అమిత్ షా.. మన్మోహన్ సింగ్ కుటుంబసభ్యులతో మాట్లాడారు. స్మారకం ఏర్పాటు చేసేందుకు స్థలాన్ని కేటాయిస్తానని చెప్పారు. స్మారకం కోసం ట్రస్ట్ ఏర్పాటు చేసి, స్థలం కేటాయించేందుకు సమయం పడుతుందని.. ఆలోగా అంత్యక్రియలు, ఇతర కార్యక్రమాలు పూర్తి చేయాలని సూచించారు. ” అని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది.

కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ

అయితే, స్మారక చిహ్నం కోసం స్థలం కేటాయించడంలో జాప్యం చేయడం పట్ల కాంగ్రెస్ పార్టీ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇది భారత తొలి సిక్కు ప్రధానమంత్రిపై అవమానం కాదా? అని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ప్రశ్నించారు. అయితే, కాంగ్రెస్ వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. మన్మోహన్ సింగ్ మృతిపై కాంగ్రెస్ నీచ రాజకీయాలు చేయడం మానుకోవాలని కాషాయ పార్టీ ప్రకటనలో పేర్కొంది. "మాజీ ప్రధాని పీవీ నరసింహారావు మరణానంతరం ఎలా ప్రవర్తించారో కాంగ్రెస్ నేతలు గుర్తుచేసుకోవాలి. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కాంగ్రెస్ ఎంతగా అవమానించిందో ఆయన కుమార్తె కూడా తెలిపింది" అని హస్తం పార్టీకి బీజేపీ చురకలు అంటించింది.

Tags:    

Similar News