దేశం గొప్ప నేతను కోల్పోయింది.. సీతారాం మృతి పట్ల రాహుల్ గాంధీ దిగ్భ్రాంతి

సీపీఐ(ఎమ్)(CPIM) జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి (Sitharam Yechury) గత కొంతకాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ గురువారం మధ్యాహ్నం మృతి చెందారు.

Update: 2024-09-12 11:26 GMT

దిశ, వెబ్ డెస్క్ : సీపీఐ(ఎమ్)(CPIM) జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి (Sitharam Yechury) గత కొంతకాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ గురువారం మధ్యాహ్నం మృతి చెందారు. కాగా సీతారాం ఏచూరి మృతి పట్ల కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) సంతాపం తెలిపారు. 'నాకు మిత్రుడైన సీతారాం ఏచూరికి భారతదేశ పరిస్థితుల మీద లోతైన అవగాహన ఉంది. సీతారాం గారూ.. దేశ సుభిక్షం గురించి మనం చేసే సుధీర్ఘ చర్చలను ఇకనుండి నేను కోల్పోతాను. ఈ విషాద సమయంలో మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, అనుచరులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను" అంటూ రాహుల్ గాంధీ తన 'ఎక్స్' ఖాతా వేదికగా పోస్ట్ చేశారు.     


Similar News