అభిమానులు, కార్యకర్తలకు తలపతి విజయ్ కీలక సందేశం

తన అభిమానులు, టీవీకే(TVK) పార్టీ కార్యకర్తలు, నాయకులకు ఆ పార్టీ అధినేత, తలపతి విజయ్(Thalapathy Vijay) కీలక సందేశం పంపించారు.

Update: 2024-09-20 07:17 GMT

దిశ, వెబ్‌డెస్క్: తన అభిమానులు, టీవీకే(TVK) పార్టీ కార్యకర్తలు, నాయకులకు ఆ పార్టీ అధినేత, తలపతి విజయ్(Thalapathy Vijay) కీలక సందేశం పంపించారు. ఈ మేరకు శుక్రవారం సోషల్ మీడియా(ఎక్స్) వేదికగా ప్రకటన విడుదల చేశారు. తమిళగ వెట్రి కళగం(టీవీకే) తొలి మహానాడు అక్టోబర్‌ 27వ తేదీన నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ నెల 23న విక్రవాండిలో ఈ మహానాడును నిర్వహించేందుకు పోలీసుల అనుమతి లభించినప్పటికీ ఆ మహానాడు నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లు చేపట్టలేదు. దీంతో మహానాడు తేదీని విజయ్‌ వాయిదా ఇటీవల చెప్పారు. తాజాగా కొత్త తేదీని విజయ్ ప్రకటించారు. ఈ సమావేశంలోనే పార్టీ సిద్ధాంతాన్ని ప్రకటిస్తారని తెలుస్తోంది. అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని విజయ్ కోరారు. కాగా, ఇప్పటికే తమిళగ వెట్రి కళగం పేరుతో అట్టహాసంగా రాజకీయ పార్టీని ప్రారంభించి రాజకీయ ప్రవేశం చేసిన విజయ్‌ ఆగస్టు 22న పార్టీ పతాకాన్ని కూడా పరిచయం చేశారు.


Similar News