Prahalad Joshi: తిరుపతి లడ్డూ వ్యవహారంపై దర్యాప్తు జరగాలి.. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి కీలక వ్యాఖ్యలు
తిరుపతి (Tirupathi) శ్రీవారి లడ్డూ కల్తీ వ్యవహారం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.
దిశ, వెబ్‌డెస్క్: తిరుపతి (Tirupathi) శ్రీవారి లడ్డూ కల్తీ వ్యవహారం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ క్రమంలోనే రాజకీయ నాయకులు, సెలబ్రెటీలు, శ్రీవారి భక్తులు ఈ ఘటనపై మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వును వాడటం పట్ల తాజాగా కేంద్ర ఆహార శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి (Union Food Minister Prahlad Joshi) సీరియస్ అయ్యారు. ఘటనపై వెంటనే సమగ్ర దర్యాప్తునకు ఆదేశిస్తామని అన్నారు. ఇవాళ ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ సీఎం చంద్రబాబు (AP CM Chandrababu) చెప్పిన నిజాలు తీవ్రంగా పరిగణించాల్సిన విషయమని పేర్కొన్నారు. లడ్డూ ప్రసాదానికి ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్లుగా ఎన్‌డీడీబీ నిర్ధారించిందని తెలిపారు. లడ్డూలో బీఫ్ కొవ్వు, చేప నూనె వాడిన విషయం కూడా తమ దృష్టి వచ్చిందని పేర్కొన్నారు. మొత్తం వ్యవహారంపై ఎంక్వైరీ జరిపించి బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు. దేశం నలుమూలల నుంచి శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు తిరుమలకు వస్తారని, వారందరి మనోభావాలను దెబ్బతీసేలా గత ప్రభుత్వం వ్యవహరించిందని ప్రహ్లాద్ జోషి ధ్వజమెత్తారు.