Tirupati Laddus Row: సనాతన ధర్మంపై జరిగిన కుట్ర- రామజన్మభూమి ప్రధాన అర్చకులు

తిరుమలలో లడ్డూ (Tirupati Laddoos) వ్యవహారంపై రామజన్మభూమి ఆలయ ప్రధాన అర్చకులు సత్యేంద్ర దాస్ (Chief Priest of Ram Janmabhoomi) స్పందించారు.

Update: 2024-09-20 08:38 GMT

దిశ, నేషనల్ బ్యూరో: తిరుమలలో లడ్డూ (Tirupati Laddoos) వ్యవహారంపై రామజన్మభూమి ఆలయ ప్రధాన అర్చకులు సత్యేంద్ర దాస్ (Chief Priest of Ram Janmabhoomi) స్పందించారు. ఇది సనాతన ధర్మంపై జరిగిన కుట్రగా ఆయన అభివర్ణించారు. "ఇది దారుణమైన చర్య, ఈ కుట్ర చేసినవారు నేరస్థుడు, దేశ ద్రోహి. ఇది తీవ్రమైన నేరమని, లక్షలాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసింది. ఇది సనాతన ధర్మంపై జరిగిన కుట్ర, దాడిగా భావిస్తున్నా. ఈ అంశాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి విచారణ జరపాలి. దోషులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి" అని అన్నారు. తిరుమల బాలాజీ అంటే ప్రజలకు ఎంతో నమ్మకం ఉందన్నారు. దేశ నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఈ ఆలయానికి వెళ్లి.. లడ్డూను ప్రసాదంగా స్వీకరిస్తుంటారని చెప్పారు.

తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు

వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నేతృత్వంలోని గత ప్రభుత్వ హయాంలో తిరుమలలో తయారయ్యే లడ్డూలలో జంతువుల కొవ్వు కలిపినట్లు ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ఇప్పటి వరకూ జరిగిన పరిశీలనలో మహా ప్రసాదంగా భావించే తిరుమల లడ్డూలో చేపనూనె వంటివి కలిసినట్లు తేలింది. ఈ నేపథ్యంలో ఈ అంశంపై పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


Similar News