Breaking News : కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు
కేంద్ర కేబినెట్ సోమవారం పలు కీలక నిర్ణయాలు ప్రకటించింది.
దిశ, వెబ్ డెస్క్ : కేంద్ర కేబినెట్ సోమవారం పలు కీలక నిర్ణయాలు ప్రకటించింది. సేంద్రీయ వ్యవసాయానికి ప్రోత్సాహం ఇవ్వడానికి రూ.2481 కోట్లతో "ప్రకృతి వ్యవసాయంపై జాతీయ మిషన్"కు, ప్రాంతీయ భాషల్లో ఆవిష్కరణలకు రూ.2,750 కోట్లతో "అటల్ ఇన్నోవేషన్ మిషన్ 2.0"కు ఆమోదముద్ర వేసింది. అలాగే అరుణాచల్ ప్రదేశ్ లో రెండు భారీ జలవిద్యుత్ ప్రాజెక్టులకు ఆమోద ముద్ర వేస్తూ.. రూ.3,689 కోట్లు కేటాయించింది. విద్యార్థుల కోసం లైబ్రరీల అనుసంధానం చేస్తూ వన్ నేషన్-వన్ సబ్ స్క్రిప్షన్ పథకాన్ని ప్రవేశ పెడుతూ.. రూ.6 వేల కోట్లను కేటాయించింది. దీనిలో ప్రముఖ అంతర్జాతీయ జర్నల్స్, పరిశోధనా పత్రాలు విద్యార్థులకు అందుబాటులో ఉండనున్నాయి. "పాన్ కార్డ్ 2.0"తో డిజిటల్ కార్డులు జారీ చేయనున్నట్టు ప్రకటించింది. ఇందుకోసం రూ.1435 కోట్లు కేంద్ర ప్రభుత్వం కేటాయించింది.