Ganderbal Terror Attack: ఉగ్రవాదంపై పోరులో దేశం ఏకమైంది- రాహుల్ గాంధీ

జమ్ముకశ్మీర్‌లోని గందర్‌బల్‌లో ఉగ్రదాడిపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Update: 2024-10-21 10:04 GMT

దిశ, నేషనల్ బ్యూరో: జమ్ముకశ్మీర్‌లోని గందర్‌బల్‌లో ఉగ్రదాడిపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. జమ్మూకశ్మీర్‌లోని గందర్‌బల్‌లో జరిగిన ఉగ్రదాడిలో వైద్యుడు, వలస కూలీలు సహా పలువురిని చంపడం చాలా పిరికి పని అని, క్షమించరాని నేరమని ఆయన అన్నారు. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని, అలాగే క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఉగ్రవాదుల దుష్టచర్య జమ్ముకశ్మీర్ లో మౌలిక సదుపాయాలు, ప్రజల విశ్వాసాన్ని ఎన్నటికీ విచ్ఛిన్నం చేయదన్నారు. ఉగ్రవాదంపై పోరులో దేశం మొత్తం ఐక్యంగా ఉందని ఆయన అన్నారు.

ఉగ్రదాడి

గందర్‌బల్ జిల్లాలోని గుండ్ ప్రాంతంలో సొరంగం నిర్మాణ పనులు నిర్వహిస్తున్న ఓ ప్రైవేట్ కంపెనీ కార్మికుల శిబిరాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో నలుగురు కార్మికులు, ఒక వైద్యుడు చికిత్స పొందుతూ మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’లో ఒక పోస్ట్‌లో, జమ్మూకశ్మీర్‌లోని సోనామార్గ్‌లోని గగాంగీర్‌లో కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులో నిమగ్నమై ఉన్న అమాయక కార్మికులపై జరిగిన ఉగ్రదాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నానని గడ్కరీ అన్నారు. “ఈ క్లిష్ట సమయంలో అమరులైన కార్మికులకు నా వినయపూర్వకమైన నివాళులర్పిస్తున్నాను. ఇంకా వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా. క్షతగాత్రులు త్వరగా, పూర్తిగా కోలుకోవాలని పార్థిస్తున్నా” అని ఆయన రాసుకొచ్చారు.


Similar News