Kashmir : ఉగ్రమూకలకు గుర్తుండిపోయేలా శాస్తి జరగాలి : జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్

దిశ, నేషనల్ బ్యూరో : గండేర్బల్ జిల్లాలో జరిగిన ఉగ్రదాడిపై జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఘాటుగా రియాక్ట్ అయ్యారు.

Update: 2024-10-21 12:20 GMT

దిశ, నేషనల్ బ్యూరో : గండేర్బల్ జిల్లాలో జరిగిన ఉగ్రదాడిపై జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ఈ దాడికి తెగబడిన ఉగ్రమూకల నుంచి తగిన మూల్యాన్ని వసూలు చేయాలని భారత భద్రతా బలగాలకు ఆయన పిలుపునిచ్చారు. సామాన్యుల ప్రాణాలు తీసినందుకు ఉగ్రవాదులకు, వారిని ప్రేరేపించిన వారికి ఎప్పటికీ గుర్తుండిపోయేలా తగిన శాస్తి చేయాలన్నారు. దీనిపై తాను జమ్మూకశ్మీర్ పోలీసులు, భారత భద్రతా బలగాలతో చర్చించినట్లు మనోజ్ సిన్హా వెల్లడించారు. ఈమేరకు ఆయన ‘ఎక్స్’ వేదికగా ఒక పోస్ట్ చేశారు.

సోమవారం పోలీసు అమరుల సంస్మరణ దినం సందర్భంగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రసంగిస్తూ.. పాకిస్తాన్‌పై ఫైర్ అయ్యారు. జమ్మూకశ్మీరులో అమాయక ప్రజల ప్రాణాలు తీసి, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు పాకిస్తాన్ కుట్ర పన్నిందన్నారు. ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్లను ముమ్మరం చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. 


Similar News