Crackers Ban: రాష్ట్రంలో క్రాకర్స్‌పై నిషేధం.. స్టాక్‌ ఉన్న గోడౌన్లు సీజ్ చేయాలని హైకోర్టు ఆదేశాలు

దీపావళి పండుగ వేళ క్రాకర్స్ లవర్స్‌కు బిగ్ షాక్ తగిలింది.

Update: 2024-10-21 17:26 GMT

దిశ, వెబ్‌డెస్క్: దీపావళి పండుగ వేళ క్రాకర్స్ లవర్స్‌కు బిగ్ షాక్ తగిలింది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా గోడౌన్లలో ఉన్న స్టాక్‌ను వెంటనే సీజ్ చేయాలంటూ ఢిల్లీ హైకోర్టు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే దేశ రాజధానిలో వాయు కాలుష్యం గుబులు పుట్టిస్తోంది. ఢిల్లీలో ప్రతిరోజు గాలి నాణ్యత అత్యంత కనిష్ట స్థాయికి పడిపోతోంది. అసలే చలికాలం కావడంతో జనం ఊపిరి తీసుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా గొంతు నొప్పి, కళ్ల మంటలు, ఆస్తమాతో సతమతం అవుతున్నారు. అసలే రాబోయేది దీపావళి పండుగ కావడంతో క్రాకర్స్‌తో వాయు కాలుష్యం మరింత పెరిగే అవకాశం ఉంది.

దీంతో అప్రమత్తమైన హైకోర్టు దీపావళి రోజున ఢిల్లీ పరిధిలో బాణాసంచా కాల్చడాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. క్రాకర్స్ అమ్మకాలు ఎట్టి పరిస్థితుల్లో అనుమతించేది లేదని పేర్కొ్ంది. అదేవిధంగా క్రాకర్స్ నిల్వ ఉంచిన గోడౌన్లపై దాడులు చేసి సరుకు రీటైల్ మార్కెట్లకు వెళ్లకుండా వెంటనే సీజ్ చేయాలని హైకోర్టు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలు అతిక్రమించి ఎవరైనా బాణాసంచా విక్రయించినట్లు తెలిస్తే.. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జస్టీస్ జస్టిస్ సంజీవ్ నారులా స్పష్టం చేశారు. 2025 జనవరి 1 వరకు ఢిల్లీ స్టేట్‌లో బాణాసంచా తయారీ, స్టాక్, విక్రయాలపై నిషేధం విధిస్తూ అక్కడి ప్రభుత్వం సెప్టెంబరు 14న ఆదేశాలు జారీ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. 


Similar News