karge: రైతులకు బీజేపీ పెద్ద శత్రువు.. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే

మహారాష్ట్రలోని రైతులకు బీజేపీ పెద్ద శత్రువుగా మారిందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు.

Update: 2024-10-21 16:23 GMT

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్రలోని రైతులకు బీజేపీ పెద్ద శత్రువుగా మారిందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వాన్ని అధికారం నుంచి తొలగించినప్పుడే రైతులకు ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. ఈ మేరకు ఆయన సోమవారం ఎక్స్‌లో పోస్ట్ చేశారు. రాష్ట్రాన్ని కరువు రహితంగా మార్చుతామనే బీజేపీ చేసిన వాగ్ధానం ఏమైందని ప్రశ్నించారు. రూ. 20,000 కోట్ల వాటర్ గ్రిడ్ హామీని నెరవేర్చడంలో విఫలమైందని తెలిపారు. రాష్ట్రంలో 20వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీమా కంపెనీలకు 8000 కోట్ల రూపాయల వరాలు కురిపించిన ప్రభుత్వం.. రైతులకు నష్టపరిహారం ఇవ్వడానికి నిరాకరిస్తోందని విమర్శించారు. ఉల్లి, సోయాబీన్ రైతులపై అధిక ఎగుమతి సుంఖం విధిస్తోందని తెలిపారు. రాష్ట్రంలోని పాల సహకార సంఘాలు సంక్షోభంలో ఉన్నాయని, ఈ విషయాన్ని ప్రభుత్వమే ఒప్పుకుందని పేర్కొన్నారు. మహారాష్ట్రలో భారీ మార్పులు అవసరమని, ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వాన్ని గద్దెదించాలని పిలుపునిచ్చారు. 

Tags:    

Similar News