Omar Abdullah: బుద్గామ్ సీటుకు ఒమర్ అబ్దుల్లా రిజైన్.. గందర్‌బల్ నుంచే ప్రాతినిధ్యం!

ఇటీవల జరిగిన జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం ఒమర్ అబ్దుల్లా రెండు నియోజకవర్గాల నుంచి గెలిచిన విషయం తెలిసిందే.

Update: 2024-10-21 11:53 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఇటీవల జరిగిన జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం ఒమర్ అబ్దుల్లా రెండు నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన విషయం తెలిసిందే. బుద్గామ్, గందర్‌బల్ అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి విజయం సాధించిన ఆయన..బుద్గామ్ స్థానానికి రిజైన్ చేసి గందర్‌బల్ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ మేరకు అబ్దుల్లా నిర్ణయాన్ని ప్రొటెం స్పీకర్ ముబారక్ గుల్ అసెంబ్లీలో సోమవారం ప్రకటించారు. గందర్బల్ నియోజకవర్గం అబ్దుల్లా కుటుంబానికి కంచుకోటగా ఉంది. ఒమర్ అబ్దుల్లా 2009 నుంచి 2014 వరకు సీఎంగా ఉన్న సమయంలో ఇదే సెగ్మెంట్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. అంతేగాక నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ)ని స్థాపించిన ఆయన తండ్రి ఫరూక్ అబ్దుల్లా, తాత షేక్ అబ్దుల్లాలు సైతం ఇక్కడి నుంచి ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహించారు. ఈ క్రమంలోనే ఒమర్ గందర్ బల్ నుంచే ఎమ్మెల్యేగా కంటిన్యూ అవడానికి నిర్ణయం తీసుకున్నారు. అబ్దుల్లా బుద్గామ్‌ను ఖాళీ చేయడంతో ఎన్సీ శాసనసభ్యుల సంఖ్య 41కి తగ్గింది. అయితే ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఐదుగురు స్వతంత్రులు, ఆప్, సీపీఐకి చెందిన ఒక్కొక్క ఎమ్మెల్యే మద్దతు ఎన్సీకి ఉంది. 


Similar News