Farmers protest: మరోసారి ఆందోళన బాట పట్టిన అన్నదాతలు

Farmers protest: మరోసారి ఆందోళన బాట పట్టిన అన్నదాతలురైతులు మరోసారి ఆందోళన బాట(Farmers protest) పట్టారు. ‘ఢిల్లీ చలో’('Dilli Chalo') పేరుతో శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంటకు నిరసన ప్రారంభించనున్నారు.

Update: 2024-12-06 04:12 GMT

దిశ, నేషనల్ బ్యూరో: రైతులు మరోసారి ఆందోళన బాట(Farmers protest) పట్టారు. పంజాబ్‌-హర్యానా(Punjab-Haryana borders) సరిహద్దులోని శంభు(Shambhu) సరిహద్దు వద్ద ‘ఢిల్లీ చలో’('Dilli Chalo') పేరుతో శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంటకు నిరసన ప్రారంభించనున్నారు. పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్దతోపాటు పలు డిమాండ్లను నెరవేర్చాలంటూ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురానున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే వేలాది మంది రైతులు శంభు సరిహద్దుకు చేరుకున్నారు. శంభు, ఖనౌరి సరిహద్దుల నుంచి రాజధాని ఢిల్లీకి పాదయాత్ర చేయాలని రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. అయితే ఖనౌగి పాయింట్ వద్ద ఉన్న రైతులు కూడా ఢిల్లీకి మార్చ్ చేపట్టనున్నారు. దీంతో, దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో భారీగా ట్రాఫిక్ జాం అయ్యే ఛాన్స్ ఉంది. వాహనరాకపోకలకు అంతరాయం కలగకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు..

అప్రమత్తమైన హర్యానా యంత్రాంగం

ఇకపోతే, రైతుల మార్చ్‌ నేపథ్యంలో హర్యానా యంత్రాంగం అప్రమత్తమైంది. సరిహద్దుల్లో కేంద్ర పారా మిలటరీ బలగాలను మోహరించారు. అంతేకాకుండా, మూడంచెలబారికేడ్లనుఏర్పాటు చేశారు. అయిదుగురు, అంతకంటే ఎక్కువ మంది ఒకచోట గుమిగూడకుండా నిషేధాజ్ఞలు జారీ చేశారు. రైతు సంఘాల నాయకులు మాట్లాడుతూ ట్రాక్టర్లు, ట్రాలీలు కాకుండా కేవలం కాలినడకన మాత్రమే పాదయాత్ర చేస్తామన్నారు. శంభు సరిహద్దు నుంచి 101 మంది రైతులతో తమ పాదయాత్ర ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ఇక్కడి నుంచి ఢిల్లీకి మార్చ్‌ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. రైతుల ఉద్యమానికి ఖాప్‌ పంచాయతీలు, వ్యాపార వర్గాల నుంచి మద్దతు లభించిందని చెప్పారు. గత ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వంతో నాలుగు రౌండ్ల చర్చలు జరిపామని, కానీ ఫిబ్రవరి 18 నుంచి ఎలాంటి చర్చలు లేవన్నారు. తమ సమస్యల పరిష్కరణ కోసమే చర్చలకు పిలుపునిచ్చామని, . ఇప్పుడు కూడా ప్రభుత్వం తమ పాదయాత్రను అడ్డుకుంటే అది తమ నైతిక విజయం అవుతుందని అన్నారు.

Tags:    

Similar News