మ్యారేజ్‌లకు పోలీసు బ్యాండ్.. ఎక్కడో తెలుసా?
మ్యారేజ్‌లో పోలీసు బ్యాండ్ ఏంటని ఆశ్చర్య పోతున్నారా అవును మీరు చదివింది నిజమే.
దిశ, వెబ్‌డెస్క్: మ్యారేజ్‌లో పోలీసు బ్యాండ్ ఏంటని ఆశ్చర్య పోతున్నారా అవును మీరు చదివింది నిజమే. పోలీసు బ్యాండ్ కేవలం ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే ప్రోగ్రామ్స్‌లో వింటుంటాం. కానీ పంజాబ్ పోలీస్ శాఖ మాత్రం ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇక నుంచి శుభకార్యాల్లో పోలీసు బ్యాండ్ వినే అవకాశాన్ని కల్పించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను ముక్త్సార్ సాహిబ్ జిల్లా అధికారులు రిలీజ్ చేశారు.
ఈ బ్యాండ్‌ను గంట కోసం బుక్ చేసుకోవాలంటే రూ.5వేలు చెల్లించాల్సి ఉంటుంది. నిర్ణీత టైం దాటితే గంటకు గవర్నమెంట్ ఎంప్లాయిస్‌కు అయితే రూ.2,500, సామాన్యులకు రూ.3.500 చొప్పున అదనంగా చెల్లించాలి. కుటుంబ వేడుకల కోసమైతే రూ.7వేలు ఫీజు చెల్లించాలి. ఈ బ్యాండ్ బుకింగ్ కోసం పోలీసు కంట్రోల్ రూంతో పాటు ప్రత్యేకంగా హెల్ప్ లైన్ నంబర్‌ను ఏర్పాటు చేయడం విశేషం.