SEBI chief: వివాదాల వేళ.. సెబీ చీఫ్ కు మరో షాక్..!

వివాదాలు చుట్టుముట్టిన వేళ సెబీ చీఫ్‌ మాధబి పురీ బచ్‌ (Madhabi puri Buch) కి మరో షాక్ తగిలింది. మాధబి బచ్ కు పార్లమెంటరీ కమిటీ (PAC) సమన్లు జారీ చేసింది.

Update: 2024-10-05 08:37 GMT

దిశ, నేషనల్ బ్యూరో: వివాదాలు చుట్టుముట్టిన వేళ సెబీ చీఫ్‌ మాధబి పురీ బచ్‌ (Madhabi puri Buch) కి మరో షాక్ తగిలింది. మాధబి బచ్ కు పార్లమెంటరీ కమిటీ (PAC) సమన్లు జారీ చేసింది. అక్టోబర్‌ 24న కమిటీ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. హిండెన్ బర్గ్ నివేదికలో అదానీ వ్యవహారానికి సంబంధించి సెబీ చీఫ్‌పై ఆరోపణలు వచ్చాయి. కాగా.. దేశంలోని టాప్ రెగ్యులేటరీ అథారిటీల పనితీరును సమీక్షించాలని పీఏసీ నిర్ణయించింది. అందులో భాగంగానే ఈ సమన్లు జారీ చేసినట్లు తెలుస్తోంది. మాధబితో పాటు ఆర్థికశాఖ, ట్రాయ్‌ అధికారులకు కూడా సమన్లు జారీ చేసింది. పార్లమెంటరీ కమిటీ సమావేశానికి సెబీ ఛైర్‌పర్సన్‌ మాధబి పురి బచ్‌, ట్రాయ్‌ ఛైర్‌పర్సన్‌ అనిల్ కుమార్‌ వ్యక్తిగతంగా హాజరయ్యే అవకాశం లేదని తెలుస్తోంది. వారి తరపున సీనియర్‌ అధికారులు సమావేశానికి ప్రాతినిధ్యం వహిస్తారని కమిటీ సభ్యులు సూచనప్రాయంగా వెల్లడించారు.

వివాదాల్లో సెబీ చీఫ్

ఇకపోతే, గత కొన్ని వారాలుగా సెబీ ఛైర్‌పర్సన్‌ పలు వివాదాల్లో చిక్కుకుంటూనే ఉన్నారు. హిండెన్ బర్గ్ నివేదికతో అదానీ షేర్ల వ్యవహారంతో, ఐసీఐసీఐ బ్యాంక్‌ వేతనం విషయం, సెబీ అధికారులు చేసిన ఫిర్యాదులతో వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. బచ్‌ ఆధ్వర్యంలోని క్యాపిటల్‌ మార్కెట్స్ రెగ్యులేటర్‌ కార్యాలయంలో వర్క్ కల్చర్ పై సెబీ అధికారులే ఆమెపై ఫిర్యాదు చేశారు. దీంతో, ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.ఇన్ని వివాదాలు చుట్టుముట్టిన నేపథ్యంలో పార్లమెంటరీ కమిటీ నుంచి సమన్లు రావడం గమనార్హం.


Similar News