ముస్లిం విద్యార్థిని కొట్టించిన ఘటనలో.. యూపీ సర్కార్ సీరియస్

ఉత్తర ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌‌లో ఓ స్కూల్‌ టీచర్‌ ముస్లిం విద్యార్థిని తోటి విద్యార్థులతో కొట్టించిన ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది.

Update: 2023-08-27 16:21 GMT

ముజఫర్‌నగర్‌ : ఉత్తర ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌‌లో ఓ స్కూల్‌ టీచర్‌ ముస్లిం విద్యార్థిని తోటి విద్యార్థులతో కొట్టించిన ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీరియస్ అయిన రాష్ట్ర సర్కారు.. ఆ ఘటన చోటుచేసుకున్న స్కూల్‌ని తాత్కాలికంగా బంద్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు రాష్ట్ర విద్యాశాఖ ఈ ఘటనపై విచారణ మొదలు పెట్టింది. స్కూల్‌ యాజమాన్యానికి నోటీసులు పంపింది.

స్కూల్ బంద్ వల్ల ఇబ్బంది కలగకుండా.. అందులో చదివే స్టూడెంట్స్‌కు స్థానికంగా ఇతర పాఠశాలల్లో తాత్కాలిక అడ్మిషన్‌లు ఇచ్చారు. నిందితురాలు టీచర్ తృప్తి త్యాగి మాత్రం తన చర్యల్ని సమర్థించుకుంటున్నారు. ఇది చాలా చిన్న విషయం అని కొట్టి పారేస్తున్నారు. కేవలం హోం వర్క్ చేయలేదన్న కారణంగానే విద్యార్థులతో కొట్టించానని, ఇందులో మతపరమైన వివక్ష ఏమీ లేదని ఆమె తేల్చి చెబుతున్నారు.


Similar News