Prashant Kishor : బైపోల్స్‌లో స్థానికులకే టికెట్లు.. జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్
దిశ, నేషనల్ బ్యూరో : త్వరలో జరిగే ఉప ఎన్నికల్లో తాము స్థానిక అభ్యర్థులకు మాత్రమే టికెట్లు ఇస్తామని జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ స్పష్టం చేశారు.
దిశ, నేషనల్ బ్యూరో : త్వరలో జరిగే ఉప ఎన్నికల్లో తాము స్థానిక అభ్యర్థులకు మాత్రమే టికెట్లు ఇస్తామని జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ స్పష్టం చేశారు. స్థానిక అభ్యర్థులకే నియోజకవర్గంలోని ప్రజల సమస్యలపై పూర్తి అవగాహన ఉంటుందన్నారు. అలాంటి నేతలే లోకల్ ప్రజల అవసరాలను అర్ధం చేసుకొని పనులు చేయించగలుగుతారని ఆయన పేర్కొన్నారు. ‘‘మా పార్టీ నుంచి పోటీ చేసే ప్రతీ అభ్యర్థి నన్ను మించిన సామర్థ్యాలను కలిగి ఉంటారు. బిహార్ వికాసం కోసం తపించే తత్వం వారిలో బలంగా ఉంటుంది’’ అని ప్రశాంత్ కిశోర్ తెలిపారు.
నవంబరు 13న బిహార్‌లోని తరారీ, రాంఘర్, బేలాగంజ్ అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నిక జరగనుంది. ఈ బైపోల్ కోసం తరారీ స్థానం నుంచి మాజీ వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ క్రిష్ణ సింగ్ పేరును పీకే ప్రకటించారు. ‘‘తరారీ నియోజకవర్గ ప్రజలు ఈసారి నన్ను కోరుకుంటున్నారు. అందుకే ప్రశాంత్ కిశోర్ నాకు పోటీ చేసే ఛాన్స్ ఇచ్చారు. ప్రత్యర్ధులు ఎవరు అనేది నాకు అనవసరం. ప్రజలకు ఏమేం చేయాలనేది మాత్రమే ఆలోచిస్తున్నా. పవిత్రమైన లక్ష్యంతో పోటీ చేస్తున్నాను. నాకు స్థానికుల్లో మంచి పేరుంది’’ అని క్రిష్ణ సింగ్ పేర్కొన్నారు.