Raj Thackeray: మహారాష్ట్ర ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ.. ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ థాక్రే

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఎటువంటి పొత్తు పెట్టుకోబోదని ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ థాక్రే స్పష్టం చేశారు.

Update: 2024-10-16 16:24 GMT

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఎటువంటి పొత్తు పెట్టుకోబోదని, ఒంటరిగానే బరిలోకి దిగుతుందని మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ థాక్రే స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని తెలిపారు. బుధవారం ఆయన ముంబైలో మీడియాతో మాట్లాడారు. పూర్తి ప్రణాళికతో ఎలక్షన్స్‌లో పోరాడతామని, ఎన్నికల అనంతరం ఏర్పాటయ్యే ప్రభుత్వంలో ఎంఎన్ఎస్ భాగస్వామిగా ఉంటుందని దీమా వ్యక్తం చేశారు. ముంబైలోని ఐదు ఎంట్రీ పాయింట్ల వద్ద టోల్ మినహాయించాలనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించిన రాజ్ థాక్రే..తమ పార్టీ దాని కోసం ఎన్నో ఏళ్లుగా డిమాండ్ చేసిందని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి అభ్యర్థుల తరఫున ప్రచారం చేసిన ఎంఎన్ఎస్ ప్రస్తుతం ఒంటరిగా బరిలోకి దిగుతానని ప్రకటించడం హాట్ టాపిక్‌గా మారింది. కాగా, 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ఎంఎన్ఎస్ రెండు ఎన్నికల్లో ఒక్కో సీటును గెలుచుకుంది. 


Similar News